సిపిఎస్ రద్దుకై సెప్టెంబర్ 1న అన్ని కలెక్టరేట్ వద్ద పికెటింగ్‌లు - ఫ్యాప్టో
ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎస్‌టియు కార్యాలయంలో సిపిఎస్ రద్దుకై సుదీర్ఘంగా చర్చించి ప్రత్యేక కార్యచరణను ప్రకటించింది. దేశంలో 89 లక్షులు, రాష్ట్రలో 1,84,000వేలమంది ఉద్యోగ భద్రత లేని ఉపాధ్యాయులు, ఉద్యోగులున్నారని, సిపిఎస్ రద్దుకై ఫ్యాప్టో ఆధ్వర్యంలో విశ్రమించని పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొదట విడతగా ‘‘క్విట్ సిపిఎస్’’ పేరుతో జులై 30న శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు జిల్లా నుండి ప్రత్యేక వాహనాల్లో జాతాలు ప్రారంభమై 12 రోజులు అన్ని జిల్లాల్లో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఆగస్టు 10వ తేదీన విజయవాడ చేరుకుంటాయన్నారు. ఆగస్టు 11న విజయవాడలో భారీ ర్యాలీ - బహిరంగ సభ వుంటుందన్నారు.
సెప్టెంబర్ 1న మాస్ క్యాజువల్ సెలవు పెట్టి అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద వేలాదిమందితో పికెటింగ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాపితంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలు పునిచ్చారు.
ఈ కార్యవర్గ సమావేశంలో చైర్మన్ పి.బాబురెడ్డి, సెక్రటరీ జనరల్ జి.హృదయరాజు, కో-చైర్మన్లు జి.నాగేశ్వరరావు, పి.పాండురంగ వరప్రసాద్, పి.కృష్ణయ్య, జి.వి.నారాయణరెడ్డి, డిప్యూటీ సెక్రటరీ జనరల్ యం.రవిచంద్రకుమార్, కార్యదర్శులు బి.కరీముల్లా చౌదరి, కె.ప్రకాష్‌రావు, ఏపిజెఏసి సెక్రటరీ జనరల్ సిహెచ్.జోసెఫ్ సుధీర్‌బాబు, కార్యవర్గ సభ్యులు షేక్ సాబ్జీ, ఎన్.రఘురామిరెడ్డి, కె.వెంకటేశ్వర రావు, ఎన్.వి.రమణయ్య, ఎం.శంకరరావు, టి.గిరిరాజ్, పి.ఆదినారాయణ, వై.శ్రీనయ్యలు పాల్గొన్నారు.