ఫ్యాప్టో జులై 11వ తేదీ మహా ధర్నా కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కొందరు మిత్రులు సిపిఎస్ సమస్య లేదని, కొందరు ఫ్యాప్టో సిపిఎస్ గురించి పట్టించుకోలేదని రకరకాల అభిప్రాయాలను ప్రచారం చేస్తున్నారు..
వారు గమనించాల్సిన అంశాలు....
1.ఫ్యాప్టో గత సంవత్సరం లోనే సిపిఎస్ సమస్య ప్రత్యేక పోరాటం గా నడపాలని, వీలైనంత విస్తృతంగా ఉద్యమం చేయాలని...
2.జనరల్ సమస్యలు పై వేరుగా పోరాటం చేయాలని నిర్ణయం చేసింది...
3. సిపిఎస్ రద్దు చేయాలని ఏకైక డిమాండ్ తో గత నవంబర్ 3,4తేదీల్లో నియోజకవర్గ స్థాయి ధర్నాలు చేపట్టింది.
4.నవంబర్ 16 వ తేదీ ఛలో అసెంబ్లీ కి పిలుపు ఇస్తే రాష్ట్రం అంతటా అరెస్టు లతో, నిరసనలతో అట్టుడికింది...
ఆ తర్వాత నే అన్ని రాజకీయ పార్టీలు సిపిఎస్ పై స్పందించారు అనేది గమనించాలి.
ఆ మధ్యలో జనరల్ సమస్యలపై జనవరి 29వ తేదీ జిల్లా స్థాయిలో ధర్నా లు చేసింది.బోధనేతర పనులు రద్దు చేయాలని మార్చి 15 న యంఈఓ కార్యాలయం వద్ద నిరసన, ధర్నాలు చేపట్టింది...
ఏప్రిల్ 4వ తేదీ పికెటింగ్ కు పిలుపు ఇవ్వగా మార్చి 28 న మంత్రి గారుచర్చలు జరిపారు..
జులై 11 జనరల్ సమస్యలు పై ధర్నా చేపట్టింది..
సిపిఎస్ పై ప్రత్యేక కార్యక్రమాలు జులై, ఆగస్టునెలల్లో చేపడుతోంది....
సిపిఎస్ ఒక్క డిమాండ్ గా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి..
ఈ విషయాలు తెలియక మాట్లాడేవారు కొందరు..
అవకాశం దొరికింది అని సంఘాలను విమర్శిస్తూ ఉద్యమాలను, ఉద్యమ స్పూర్తి ని దెబ్బ తీయాలని అదే పని గా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసే ముఠా ఈమధ్య కాలంలో అవతరించింది....
ఆవేదన తో ఉన్న వారికి, తెలియని వారికి వివరాలు చెప్పాలి..
కానీ ఉద్యమాలను దెబ్బతీయాలనే వారికి ఐక్యతతో తగిన బుద్ధి చెప్పాలి...