ఇక నీట్, జేఈఈ ఏడాదికి రెండు సార్లు
The same student can take the exam two times a year and the best score will be taken into consideration said the Union HRD Minister.
The JEE and NEET examinations will now take place twice a year, announced the HRD Minister Prakash Javadekar in a press conference on Saturday in New Delhi. “The National Testing Agency will conduct them this year. The same student can take the exam both times a year and the best score will be counted,” he said.
Furthermore, he said that all examinations under the National Testing Agency will be computer-based. “Computer centres will be set up where students with no access to computers can practise from August-end or September.”
ఇకపై ఈ పరీక్షలన్నింటిని సీబీఎస్‌ఈ స్థానంలో ఎన్టీఏ నిర్వహిస్తుందని జవదేకర్ పేర్కొన్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి, మే నెలల్లో నీట్, జనవరి, ఏప్రిల్ నెలల్లో జేఈఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు రెండు సార్లు నీట్ పరీక్షను రాస్తే వచ్చే బెస్ట్ స్కోర్‌ను అడ్మిషన్ల కోసం పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది విద్యార్థులకు లాభం చేకూరుతుంది. ఏడాదిలో ఒక ప్రయత్నంలో సీటు సాధించలేకపోయిన వారు వెంటనే మరో ప్రయత్నం చేయడం ద్వారా విజయం సాధించే అవకాశం కలుగుతుంది.
జాతీయ అర్హత పరీక్ష(నెట్) డిసెంబరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. జేఈఈ(మెయిన్స్) ప్రవేశ పరీక్షను ఏడాదిలో జనవరి, ఏప్రిల్‌లలో నిర్వహిస్తామని, నీట్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి, మే నెలల్లో పెడతామని వెల్లడించారు. ప్రతి పరీక్షను నాలుగు లేదా అయిదు తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షలను ఆన్‌లైన్ నిర్వహిస్తామని, విద్యార్థులు ఇళ్లలో లేదా అధికారికంగా గుర్తించిన కంప్యూటర్ సెంటర్లలో ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చని జావడేకర్ వెల్లడించారు. త్వరలోనే అధికారికంగా గుర్తించిన కంప్యూటర్ సెంటర్ల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సిలబస్, ప్రశ్నల ఫార్మాట్, భాష, ఫీజుల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు.