Type Here to Get Search Results !

15 రోజుల PRC ARREARS ఇవ్వాలన్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలి

15 రోజుల అరియర్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలి యూటీఫ్

 ఆం.ప్ర. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్* *శ్రీయుతులు చైర్మన్ / సెక్రటరీ జనరల్ గార్లకి ఏపి జెఏసి, విజయవాడ,*
రాష్ట్ర విభజన సమయంలో జరిగిన అన్యాయం పట్ల తీవ్ర ఆగ్రహం, ఆందోళనతో ఉన్న ప్రజలు ఆంధ్రప్రదేశీను అభివృద్ధి చేస్తారని నమ్మి బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలను గెలిపించారు.
ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం పట్ల సహనంతో సహకారం అందించారు. 10 సం||లు హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉన్నప్పటికి రెండేళ్ళలోనే అమరావతికి వచ్చి వనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నియమించిన PRC 43%తో అమలు అయిందనే ఆనందం వ్యక్తం చేశారు. .
2014లో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని సంక్షేమ కార్యక్రమాలకు ఒక రోజు 'బేసిక్ పే' ను 12.07.2014 తేదీన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండకు విరాళంగా ఇచ్చారు.
హుదూద్ తుఫాన్ వస్తే రెండు రోజుల 'బేసిక్ పే'ను 17.10.2014వ తేదీన విరాళంగా ఇచ్చారు.
2015లో 43% PRC ఇచ్చారని 10 నెలల అరియర్స్ తెలిస్తే అందులో రాజధాని అభివృద్ధికి ఒక నెల అరియర్ లో సగం ఇస్తామని జెఏసి ప్రకటిస్తే అంగీకరించారు.
కాని 4 సంవత్సరాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అనేక పోరాటాలు, ప్రాతినిధ్యాలు చేసినా అరియర్స్ చెల్లించలేదు.
రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానంగా కేంద్రానిదే. నాలుగేళ్ళు కేంద్రం నుండి నిధులు రాకపోయిన వారితో కలిసి అధికారం పంచుకున్నది రాష్ట్రంలోని అధికార పార్టీ. ఇప్పుడైనా కేంద్రం నుండి నిధులు రాబట్టాల్సిన బాధ్యత అధికార పార్టీదే. ఇందుకు అవసరమైతే అన్ని పార్టీలను, ప్రజలను కలుపుకుని చిత్తశుద్ధితో ఉద్యమించాలి.
ఇటీవల దేశంలో వచ్చిన మార్పులతో ఎన్నికల వాతావరణం ఏర్పడినది. ఈ దశలో అధికార, ప్రతిపక్షపార్టీలు వాగ్ధానాల వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఉద్యోగులను మంచి చేసుకోవాలనే తాపత్రయమూ పెరుగుతోంది.
మనం అరియర్స్ కోసం పోరాడినప్పుడు స్పందించని ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు అరియర్స్ చెల్లిస్తానంటున్నదో అందరికీ అర్ధం అయిన విషయమే.
ఈ దశలో రాజధాని నిర్మాణంకోసం నాలుగేళ్ళ ఆలస్యం తరువాత చెల్లిస్తున్న అరియర్స్ నుంచి కూడా విరాళం ఇవ్వాలనడం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఉపాధ్యాయులలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
రాజధాని నిర్మాణానికి 15 రోజుల అరియర్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యక్తిగత ఆప్షన్ ను పరిగణలోకి తీసుకోవడం మంచిదని యుటియఫ్ అభిప్రాయం. నిధులు ఇవ్వాల్సిన కేంద్రాన్ని గట్టిగా నిలదీయవలసిన బాధ్యత ఉన్న ప్రజా ప్రతినిధులను వదిలేసి ఉద్యోగులను విరాళాలు ఇవ్వాలని చేసిన నిర్ణయాన్ని జెఏసి పున:సమీక్ష చేసుకోవాలని యుటియఫ్ కోరుతున్నది.

➖ షేక్ సాబ్జీ , అధ్యక్షులు.

➖ పి. బాబు రెడ్డి, ప్రధానకార్యదర్శి.
Tags