211 ఉర్దూ ఎస్జీటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో ఉర్దూ ఎస్జీటీ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 211 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి వెల్లడించారు. వీటికోసం ఆగస్టు 4 నుంచి 14 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 16న రాత పరీక్ష నిర్వహించి అదే నెల 23న ఫలితాలను వెల్లడించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.