Type Here to Get Search Results !

జీవో 550పై వ్యాజ్యాల్లో వాదనలు పూర్తి - తీర్పును వాయిదా వేసిన హైకోర్టు

జీవో 550పై వ్యాజ్యాల్లో వాదనలు పూర్తి - తీర్పును వాయిదా వేసిన హైకోర్టు

  • ఎంబిబిఎస్‌ తరగతులెన్నడో!
Andhra Jyothi News:

ప్రతిభతో జనరల్‌ కేటగరీలో మెడికల్‌ సీటు పొందిన రిజర్వుడు మెరిటోరియస్‌ క్యాండిడేట్‌ (ఆర్‌ఎంసీ) ఆ సీటును ఖాళీచేస్తే దాన్ని ఎవరితో భర్తీ చేయాలనే అంశంపై స్పష్టత రాలేదని హైకోర్టు అభిప్రాయపడింది. వైద్య విద్య సీట్లను రోస్టర్‌ విధానంలో భర్తీ చేయడం సాధ్యం కాదని, అది కేవలం ఉద్యోగ వర్గాలకే వర్తిస్తుందని తెలిపింది. మెడికల్‌ సీట్ల భర్తీకి సంబంధించి జీవో 550ని అమలుకు అనుకూలంగా, వ్యతిరేకంగా దాఖలైన వేర్వేరు పిటిషన్లలో మంగళవారం వాదనలు ముగిసాయి. వాదనలు విన్న ధర్మాసనం... తమ సంక్షిప్త వాదనలను ఒక పేజీకి మించకుండా రాతపూర్వకంగా ఇవ్వాలని న్యాయవాదులకు సూ చించింది. ఈ వ్యాజ్యాల్లో తీర్పు వాయుదా వేసింది. హైకోర్టు సీజే జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.
రిజర్వుడు అభ్యర్థులు ప్రతిభతో జనరల్‌ కోటాలో సీట్లు పొందాక దాన్ని వదులుకుని మరో కాలేజీలో చేరితే... ఆ సీటును అదే సామాజిక వర్గానికి చెందిన వారితో భర్తీ చేయాలని ఉమ్మడి ఏపీలో 2001లో జీవో 550 జారీచేశారు. ఈ జీవోలోని ఒక భాగాన్ని హై కోర్టు నిలుపుదల చేయడంతో ఈ సీట్లను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. దీంతో తాము సీట్లు కోల్పోతున్నామం టూ రిజర్వుడు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. జీవోను వ్యతిరేకిస్తూ మరికొందరు కోర్టుకు వెళ్లారు. జనరల్‌ కేటగిరి (ఓసీ) అభ్యర్థుల తరఫున న్యాయవాది గంటా రామారావు వాదించారు. జనరల్‌ కేటగిరిలో సీటు పొందిన ఆర్‌ఎంసీ అభ్యర్థి ఆ సీటు వదులుకుని పొరుగు రాష్ర్టాల్లో చేరినప్పటికీ... అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులతో భర్తీచేయడం సరికాదన్నారు. ఇలా చేస్తే రిజర్వేషన్‌ 50శాతానికి మించిపోతుందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15(1)లను ఉల్లంఘించడమేన్నారు.

ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ శ్రీనివాస్‌ వాదిస్తూ... ఖాళీ అయి న సీట్లను జీవో 550 అనుసరించి అదే సామాజిక వర్గానికి చెందిన వారితో భర్తీ చేస్తే... కోటా శాతం 50కి మించుతుందని చెబుతున్నారేగాని, ఆధారాలు చూపడం లేదన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు అనుగుణంగానే జీవో 550 జారీచేశారన్నారు. జీవోకు అనుకూలంగా దాఖలైన వ్యాజ్యాల్లో సీనియర్‌ న్యాయవాదులు ఎ. సత్యప్రసాద్‌, కేఈ కృష్ణమూర్తి జె. సుధీర్‌లు వాదించారు. జనరల్‌ కేటగిరిలో సీటు పొందిన ఆర్‌ఎంసీ అభ్యర్థి మరొక కాలేజీలో రిజర్వు కోటాలో చేరిన పక్షంలో ఆ సీటును అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ప్రతిభ ఆధారంగా కేటాయించాలన్నారు.


ఎంబిబిఎస్‌ తరగతులెన్నడో - Prajasakti News!

ఈ ఏడాది ఎంబిబిఎస్‌ కౌన్సెలింగ్‌ వివాదాస్పదం కావడంతో నీట్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. జీవో 550పై గతేడాది ఆగస్టులో హైకోర్టు స్టే విధించడంతో ఈ ఏడాది రిజర్వేషన్‌ అభ్యర్థులు నష్టపోయారంటూ బిసి వర్గాలకు చెందిన పలు సంఘాలు ఆందోళన చేశాయి. ఈ జీవోను అమలు చేయకపోవడంతో మెరిట్‌ ఓపెన్‌ క్యాటగిరీ కోటాలో ఖాళీ అయిన సీటును బిసి విద్యార్థులు కోల్పోయారని పేర్కొ న్నాయి. అందువల్ల కౌన్సెలింగ్‌ నిలిపివేయాలని, మొదటి దశ రీ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని మంత్రి అచ్చెన్నాయుడుతో సహా వివిధ బిసి వర్గాలు డిమాండ్‌ చేసిన సంగతి విదితమే. ఆ జీవోపై కోర్టు ఇచ్చిన స్టేపై ప్రభుత్వం తరఫున ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ కూడా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అలా కోర్టులో వివాదం ఉన్నందున తుది తీర్పు వచ్చే వరకు మొదటి దశలో కౌన్సెలింగ్‌ పూర్తయి సీట్లు పొందిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా వుండగా ఎంసిఐ షెడ్యూల్‌ ప్రకారం ఎంబిబిఎస్‌ మొదటి సంవత్సరం ఎ,బి క్యాటగిరీ సీట్లు ఇప్పటికే భర్తీ ప్రక్రియ పూర్తయి, నేటి నుంచి తరగతులు నిర్వహించాల్సి ఉంది. కోర్టు తుది తీర్పు ఇంకా వెలువడకపోవడంతో తరగతులు ప్రారంభం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ విషయంపై ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ విసి సివి రావును వివరణ కోరగా కోర్టు తుది తీర్పు ప్రకారమే చర్యలు తీసుకుం టామని ప్రజాశక్తికి తెలిపారు.

ముగిసిన వాదనలు

తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వైద్య విద్య సీట్ల భర్తీ సమయంలో జీవో 550ను అమలును సవాల్‌ చేస్తూ, సమర్థిస్తూ వేర్వేరుగా దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును తర్వాత వెలువరిస్తామని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్‌ రాధాకష్ణన్‌, న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులు ఓపెన్‌ కేటగిరీలో ఏదైనా మెడికల్‌ కాలేజీ సీటు పొందిన తర్వాత ఆసీటు కాదని రిజర్వు కేటగిరీ కోటాలో మరో కాలేజీలో సీటులో చేరినప్పుడు ఖాళీ చేసిన సీటును అదే రిజర్వేషన్‌ కేటగిరీకి చెందిన సామాజికవర్గం అభ్యర్థితోనే భర్తీ చేసేందుకు వీలుకల్పిస్తూ సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 2001 జూలై 30న జీవో 550ను జారీ చేసింది. ఈ జీవో అమలులో కొంత భాగాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఖాళీ అయిన సీట్లను మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయకపోతే రిజర్వేషన్లు 50 శాతానికి మించుతున్నాయని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఓపెన్‌ సీటును రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థి వదులు కంటే సదరు సీటును అదే రిజర్వేషన్‌ సామాజికవర్గ అభ్యర్థితోనే భర్తీ చేయాలంటూ కూడా హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీనిపై వాదన, ప్రతివాదనల అనంతరం తీర్పును వాయిదా వేస్తున్నట్లు బెంచ్‌ ప్రకటించింది.
Tags