Type Here to Get Search Results !

ట్రిపుల్‌ఐటీకి ఎంపికైన విద్యార్థులు 23న హాజరు కావాలి

ట్రిపుల్‌ఐటీకి ఎంపికైన విద్యార్థులు 23న హాజరు కావాలి


🌻రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు ఇటీవల ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈనెల 23న హాజరు కావాలని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ ఇన్‌ఛార్జి డైరెక్టరు డాక్టర్‌ అమరేంద్రకుమార్‌ తెలిపారు. ఈనెల 4, 5, 6, 7 తేదీలలో ఆయా ప్రాంగణాల్లో నిర్వహించిన ప్రవేశాలకు సంబంధించి ఇడుపులపాయకు 815 మంది, ఒంగోలుకు సంబంధించి 806 మంది విద్యార్థిని, విద్యార్థులు ప్రవేశాలు పొందారని చెప్పారు.

🌻 వారికి ఆయా క్యాంపస్‌లలో తరగతి గదులు, వసతి గదులు కేటాయించామన్నారు. వీరి రాక కోసం అదే రోజు తమ ట్రిపుల్‌ఐటీకి చెందిన బస్సును వేంపల్లె నుంచి ఏర్పాటు చేశామని, దీన్ని విద్యార్థులు గుర్తించి 23వ తేదీ సాయంత్రంలోగా ట్రిపుల్‌ఐటీలకు చేరుకోవాలని ఆయన కోరారు.
Tags