నీట్ తమిళ విద్యార్థుల గ్రేస్ మార్కులపై సుప్రీంకోర్టు స్టే
🌻న్యూఢిల్లీ: తమిళంలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులందరికీ 196 మార్కుల చొప్పున కలుపాలంటూ మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ జారీచేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసు విచారణను రెండు వారాల తర్వాత విచారిస్తామని జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం స్పష్టంచేసింది.
🌻 ప్రస్తుత అడ్డంకుల్ని అధిగమించేందుకు ఇరుపార్టీలు సరైన పరిష్కారమార్గాలతో రావాలంటూ వారికి సూచిస్తూ, నోటీసులు జారీచేసింది. నీట్ గ్రేస్ మార్కులపై మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌చేస్తూ సీబీఎస్‌ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ సందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ..
🌻ఈ పద్ధతిలో మేం మార్కులు వేయలేం కదా? అని పరోక్షంగా గ్రేస్ మార్కులను ప్రస్తావించారు. అదనపు మార్కులను కలుపడం ద్వారా తమిళ మాధ్యమాన్ని ఎంచుకున్న అభ్యర్థులు ఇతరుల కంటే ఎక్కువ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. ఈ కేసును రెండు వారాల తర్వాత విచారిస్తామని పేర్కొన్నారు.