Type Here to Get Search Results !

సహాయ ప్రొఫెసర్లకు.. పీహెచ్‌డీ తప్పనిసరి UGC

సహాయ ప్రొఫెసర్లకు.. పీహెచ్‌డీ తప్పనిసరి!

పదేళ్ల అనుభవం ఉంటేనే ప్రొఫెసర్‌
యూజీసీ కొత్త నిబంధనలు

విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) కొత్త నిబంధనలను జారీ చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18న గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం కొత్త నిబంధనలు ఇవీ..

అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ నియామకానికి అభ్యర్థుల వడపోతకు 100 మార్కులతో కూడిన ఫార్ములాను సూచించింది. దీని ప్రకారం డిగ్రీ/పీజీలలో వచ్చిన మార్కులు, ఎంఫిల్‌/పీహెచ్‌డీ అర్హతలు, నెట్‌/స్లెట్‌/రిసెర్చ్‌ పబ్లికేషన్స్‌/టీచింగ్‌/పోస్ట్‌ డాక్టోరల్‌ అనుభవం, అవార్డులకు మార్కులను కేటాయించి మెరిట్‌ లిస్టును తయారు చేయాలి.

ఒక పోస్టుకు ఎంత నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలవాలో సంబంధిత వర్సిటీలు నిర్ణయిస్తాయి. మొత్తంగా చూస్తే విద్యా విషయక సామర్ధ్యానికి 80 మార్కులు, పరిశోధన పత్రాలకు 10 మార్కులు, బోధనానుభవానికి 10 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు అభ్యర్థుల వడపోతకు ఉపయోగించాలని యూజీసీ పేర్కొంది.

ప్రొఫెసర్‌ పోస్టుకు అభ్యర్థులను కచ్చితంగా తమ గైడ్‌షిప్‌ కింద పీహెచ్‌డీ డిగ్రీలు ఉండాలి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా లేదా అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా లేదా ప్రొఫెసర్‌గా 10 ఏళ్ల అనుభవం ఉండాలని పేర్కొంది.

మంజూరైన ప్రొఫెసర్‌ పోస్టుల్లో 10ు సీనియర్‌ ప్రొఫెసర్‌గా నియామకాలు చేసుకోవచ్చు.

అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు వైస్‌చాన్సెలర్‌ లేదా పదేళ్ల అనుభవమున్న ఒక ప్రొఫెసర్‌ను అతని నామినీగా సెలెక్షన్‌ కమిటీకి చైర్‌పర్సన్‌గా నియమించవచ్చు.

పాత నిబంధనల ప్రకారం సీఏఎస్‌ పదోన్నతులకు అర్హత పొందిన అభ్యర్థులు.. పాత నిబంధనల మేరకు లేదా కొత్త నిబంధనల మేరకు ఉంచుకోవడానికి వారికి మూడేళ్ల వరకు అవకాశం ఇచ్చారు. టీచర్స్‌కు ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం కల్పించారు.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సర్వీ్‌సను అకడమిక్‌ లెవల్‌-10గా పేర్కొన్నారు. అకడమిక్‌ లెవల్‌ -10 నుంచి 11కు పీహెచ్‌డీతో నాలుగేళ్ల అనుభవం ఉన్న వారిని ప్రమోట్‌ చేస్తారు. అకడమిక్‌ లెవల్‌-11 నుంచి 12కు ఐదేళ్ల అనుభవం ఉన్నవారిని ప్రమోట్‌ చేస్తారు. అకడమిక్‌ లెవల్‌ -12 నుంచి 13(ఏ)కు అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా అక్కడి నుంచి మూడేళ్లకు ప్రమోట్‌ చేస్తారు. ఆ తర్వాత మూడేళ్లకు ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పిస్తారు.

నూతన పేస్కేళ్లను 2016 జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు. దీనికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయనుంది. కొత్తగా చేరే అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌కు పీహెచ్‌డీ ఉంటే ఐదు ఇంక్రిమెంట్లను ఇస్తారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు ప్రారంభ మూల వేతనం రూ.57,700గా నిర్ణయించారు. ప్రస్తుతం అది రూ.21,600గా ఉంది.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు సంబంధించి నెట్‌/స్లెట్‌ లేదా 2009 నిబంధనల ప్రకారం అవార్డు అయిన ఫీహెచ్‌డీని అర్హతగా చూపించారు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులతో పాటు బీసీ అభ్యర్థులకు కూడా పీజీ అర్హతతో పాటు 5ు మినహాయింపు ఇస్తూ 50ు అర్హతగా నిర్ణయించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు పీహెచ్‌డీ డిగ్రీని 2021 జూలై ఒకటి నుంచి తప్పనిసరి చేశారు

యూజీసీ నిబంధనలు-2018 అమలు చేయని వర్సిటీలకు నిధులను నిలిపేస్తారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌కు పీజీలో 55% మార్కులు ఉండాలి. అయితే ‘గుడ్‌ అకడమిక్‌ రికార్డ్‌’ అనేపదం తొలగించారు.

పదోన్నతి పొందే వారికి క్రెడెన్షియల్స్‌(సాధించిన రికార్డు) తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.
Tags