31న యూజీసీ-నెట్ ఫలితాలు
న్యూఢిల్లీ, జూలై 24: యూజీసీ-నెట్ ఫలితాలను ఈ నెల 31న విడుదల చేయడానికి సీబీఎ్‌సఈ రంగం సిద్ధం చేసింది. ఈ నెల 8న పరీక్షను నిర్వహించగా, 23 రోజుల్లోపే ఫలితాలు విడుదల చేస్తుండడం విశేషం. ఒకవేళ జూలై 31 కాకపోతే, ఆగస్టు 4 లోపు ఫలితాలు విడుదల చేయడం ఖాయమని సీబీఎ్‌సఈ వర్గాలు తెలిపాయి.