ఎయిడెడ్ డ్రాయింగ్ అధికారిగా ఎంఈవో
🌻అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్ టీచర్లకు జీతాల డ్రాయింగ్ అధికారిగా ఎంఈవో ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్ టీచర్లకు సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానంలో, జిల్లా విద్యాధికారి కార్యాలయం ద్వారా జీతాలు చెల్లించడం వల్ల జాప్యం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి.🌻కాగా, డీడీవో అధికారాలను ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకే కొనసాగిస్తూ ఉత్తర్వులు రానున్నాయని ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.ఎ్‌స.రామకృష్ణ తెలిపారు.
10 లక్షల మందికి నిరుద్యోగ భృతి
♦వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ*♦అప్రెంటిస్ కోసం పరిశ్రమలతో ఒప్పందాలు*
*♦ఉద్యోగ అవకాశాల కోసం జాబ్ పోర్టల్*
*♦మార్గదర్శకాలపై మంత్రుల కమిటీ చర్చ*
🌻అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 10లక్షల మందికి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వనుంది. కనీస విద్యార్హత డిగ్రీ ఉండి.. 22-35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ పథకం మార్గదర్శకాలపై మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంద్రలు మంగళవారం ఇక్కడ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నిరుద్యోగ భృతి పొందే యువతీయువకులకు వివిధ శాఖల అనుసంధానంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. నిరుద్యోగ భృతికి నమోదు చేసుకునే సమయంలోనే వారికిష్టమైన మూడు రంగాలను ఎంచుకునే అవకాశం ఇస్తారు. దాని ఆధారంగా పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాలేమిటో చూసి... వాటికి ఎంపికయ్యే విధంగా ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారు.
🌻 నైపుణ్యాభివృద్ధితో పాటు పరిశ్రమలతో ఒప్పందం చేసుకుని నిరుద్యోగులను అప్రెంటి్‌సలుగా తీసుకునేలా చూస్తారు.
🌻కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రెంటిస్ కార్యక్రమాన్ని వినియోగించుకుంటూ... రాష్ట్ర ప్రభుత్వ అప్రెంటిస్ ప్రోత్సాహాన్ని అనుసంధానం చేసి నిరుద్యోగ యువతను పెద్దఎత్తున అప్రెంటీ్‌సలుగా తీసుకుంటారు. మరోవైపు నిరుద్యోగ భృతి అందుకునే యువతీయువకుల వివరాలతో జాబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు ఈ డేటా అందుబాటులో ఉంచి... ఆయా కంపెనీలు తమకు కావాల్సిన అర్హతలున్నవారిని ఎంపిక చేసుకునే వీలు కల్పిస్తారు.
🌻 అటు కంపెనీల కోసం, ఇటు యువతీయువకులకు ఉద్యోగాల కల్పన కోసం సులభంగా ఉండేలా ప్రత్యేక మొబైల్ యాప్ తయారుచేయాలని నిర్ణయించారు.
🌻అంతేకాదు... నిరుద్యోగ భృతికోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించాలనీ మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ వెబ్‌సైట్‌లో ఎవరైనా తమ ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే... వారి ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే నిరుద్యోగ భృతికి అర్హులా?.. కాదా? అనే విషయం తెలిసిపోతుంది. అనర్హులైతే కారణాలు కూడా చెప్పేలా ఈ వెబ్‌సైట్ ఉండాలని నిర్ణయించారు.
🌻ఒకవేళ అర్హత ఉన్నా భృతి రాకుంటే 1100కు ఫోన్ చేస్తే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికే నిరుద్యోగ భృతి అందిస్తారు. ఏడాదికి రూ.1200 కోట్లు దీనికోసం ఖర్చవుతాయని అంచనా. ఈ మార్గదర్శకాలన్నింటినీ ఆరో తేదీన మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.
850 పోస్టుులు స్పెషల్ డీఎస్సీ
ఔట్ సోర్సింగ్‌లో మరో 250: ఆనందబాబు*🌻అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 850 ఉపాధ్యాయ పోస్టులను స్పెషల్ డీఎస్సీ నిర్వహించి ఏపీపీఎస్సీతో ద్వారా భర్తీ చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు.
🌻మరో 250 ఉపాధ్యాయ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఆర్థికశాఖ అనుమతి కోరామని, అనుమతి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామన్నారు. గురుకుల పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యమని మంత్రి చెప్పారు.
🌻 మంగళవారం సచివాలయంలో ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల 13 జిల్లాల కోఆర్డినేటర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఆరునే డీఎస్సీ
1-2 రోజుల్లో ఆర్థికశాఖ అనుమతులు: గంటాడీఈడీ కళాశాలల పనితీరుపై కమిటీ
ప్రమాణాలు లేకపోతే మూసివేస్తామని హెచ్చరిక
విశాఖపట్నం, జూలై 3(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ-2018 ప్రకటనను ఈనెల ఆరో తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో మంగళవారం ఉదయం డీసెట్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. డీఎస్సీలో కొన్ని పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి రావలసి ఉందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి పేషీ అధికారులు ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారన్నారు. బహుశా ఒకటి, రెండు రోజుల్లో అనుమతి వస్తుందని, ఆరున డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేస్తామని, దీనిపై సందేహాలు వద్దన్నారు.
కాగా, రాష్ట్రంలో 767 ప్రైవేటు డీఈడీ కళాశాలల్లో చాలా వాటిలో కనీస ప్రమాణాలు పాటించడం లేదని, తరగతులకు విద్యార్థులు హాజరుకారని, అధ్యాపకులు ఉండరనేది వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. వీటిలో బోగస్ కళాశాలలు ఉన్నాయని, అయితే అనేక కారణాలతో ఇటువంటివి కొనసాగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డీఈడీ కళాశాలల్లో విద్యా ప్రమాణాల తనిఖీకి కమిటీ వేస్తామన్నారు. ప్రమాణాలు లేవని కమిటీ నిర్ధారిస్తే అటువంటి కళాశాలలను మూసివేస్తామన్నారు. బడిపిల్లల యూనిఫారాల నాణ్యతపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆప్కోకు ఆర్డర్ ఇస్తే...ప్రైవేటు మిల్లుల నుంచి కొనుగోలు చేసి యూనిఫారాలు సరఫరా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది నుంచి ఆప్కోను తప్పించి ముందుగా మిల్లుల నుంచి సరఫరా చేసేలా టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. లేదంటే తల్లిదండ్రులకే డబ్బులిచ్చి యూనిఫారాలు కొనుగోలు చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కమిషనర్ కె.సంఽధ్యారాణి, ఏయూ పాలకమండలి సభ్యుడు పి.సోమనాథ్, రిజిస్ట్రార్ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు, డీసెట్ కన్వీనర్ పి.పార్వతి తదితరులు పాల్గొన్నారు.
పర్మినెంట్ స్టాండింగ్ కమిటీతో విద్యార్థులకు మేలు : జెఆర్ పుష్పరాజ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :పర్మినెంట్ స్టాండింగ్ కమిటీ ఏర్పాటుతో సాంఘిక సంక్షేమ శాఖల్లో చదువుకునే విద్యార్థులకు మేలు కలుగుతుందని ఎపి పుడ్ కమిషన్ ఛైర్మన్ జెఆర్ పుష్పరాజ్ అన్నారు. ఆటోనగర్‌లోని పుడ్ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం సాంఘిక సంక్షేమశాఖల హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ ఏర్పాటుతో ప్రతి ఏడాది ఏప్రిల్ ఒకటి నుండి 15 లోపు కమిటీ సభ్యులు మెనూ డైట్ చార్జీలపై సమీక్షించి డైట్ చార్జీలు పెంచాల్సి వస్తే నివేధికలో సూచనలు చేస్తారని తెలిపారు. అంగన్‌వాడీలకు సరఫరా చేసే కోడిగుడ్లు చిన్నవిగా ఉండటం, నాణ్యత లేనివి సరఫరా చేస్తున్నారనే అంశంపై పుడ్ కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయించిందని తెలిపారు. విలేకరుల సమావేశంలో పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ జి రవిబాబు, పుడ్ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.
డైట్ సెట్‌లో మహిళల హవా!
ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటాడీఈడీలో ప్రవేశాలకు 11న కౌన్సెలింగ్
విశాఖపట్నం, జూలై 3(ఆంధ్రజ్యోతి): డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ) కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన డైట్ సెట్-2018 ఫలితాల్లో మహిళలు విజృంభించారు. ఉత్తీర్ణులైన 44,120 మందిలో పురుషులు 10,003, మహిళలు 34,127 మంది ఉన్నారు. మంగళవారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు డైట్ సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మే 17, 18 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 52,936 మంది అభ్యర్థులు హాజరుకాగా, 44,120 మంది(83.35ు) ఉత్తీర్ణులయ్యారు. ఓసీ/బీసీలకు 50ు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 45ు మార్కులను అర్హతగా నిర్ణయించారు. దీంతో ఓసీ/బీసీలు 9,322 మంది, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 2,167 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ నేపథ్యంలో కటాఫ్ తగ్గించాలని నిర్ణయించారు. ఓసీ/బీసీలకు 35ు, ఇతర వర్గాలకు 25ు మార్కులను కనీస అర్హతగా ఖరారుచేశారు. ఈ నేపథ్యంలో ఓసీ/బీసీలు 24,440, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 19,680 మంది పాసయ్యారు.
11న కౌన్సెలింగ్
డీఈడీ కళాశాలల్లో ఈ నెల 11న తొలిదశ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. 19న తొలి దశ ప్రవేశాలు ఉంటాయి. 20 నుంచి 23 వరకు ఆయా కళాశాలల్లో సర్టిఫికెట్ల తనిఖీ అనంతరం తుది ప్రవేశ పత్రం జారీ చేస్తారు. రెండో దశ కౌన్సెలింగ్ ఈ నెల 30న ప్రారంభమై వచ్చే నెల 8 నాటికి పూర్తిచేస్తారు. ప్రత్యేక కౌన్సెలింగ్ వచ్చే నెల 14న నిర్వహిస్తారు. ఆగస్టు ఒకటి నుంచి తరగతులు ప్రారంభిస్తారు.