Type Here to Get Search Results !

5/7/18 నేటి ముఖ్య విద్యా వార్తలు

గెజిట్‌’పై తర్జన భర్జన!

ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీలకు అర్హత
‘టెట్‌’ను మినహాయించి డీఎస్సీకి అవకాశం!
పాఠశాల విద్యాశాఖ సమాలోచనలు
సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ చేసినవారు కూడా అర్హులేనని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. ఎన్‌సీటీఈ మార్గదర్శకాలను అమలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ అంశంపై అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేయాలని నిర్ణయించింది. పాఠశాల విద్యాకమిషనర్‌ కె. సంధ్యారాణి బుధవారం సంబంధిత అధికారులతో ‘గెజిట్‌’పై చర్చించారు. త్వరలో విడుదల చేయనున్న డీఎస్సీ ప్రకటనకు, గెజిట్‌ నోటిఫికేషన్‌కు లింకు ఉండడంతో విస్తృత అధ్యయనం అనివార్యంగా మారింది.
ఎస్‌జీటీ పోస్టుల్లో బీఈడీ అభ్యర్థులకు అర్హత కల్పించినా.. వారికి ‘టెట్‌’ నుంచి మినహాయింపు ఇవ్వొచ్చా? ‘టెట్‌’ పేపర్‌-1లో పాసైన అభ్యర్థులకే డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడమా? తొలుత బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించడమా? అన్న కోణంలో చర్చలు జరిపారు. ప్రస్తుతానికి ‘టెట్‌’ అర్హత లేని బీఈడీ అభ్యర్థులందరికీ డీఎస్సీకి అర్హత కల్పించి, ఎంపికైన తర్వాత వారికి ఎస్‌జీటీలకు అవసరమైన ‘టెట్‌’ పేపర్‌-1 నిర్వహిస్తే ఎలా ఉంటుందని చర్చించారు. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం.. గతంలో టెట్‌ను 2 పేపర్లుగా నిర్వహించారు. అంటే డీఈడీ అభ్యర్థులకు పేపర్‌-1, బీఎడ్‌ అభ్యర్థులకు పేపర్‌-2 నిర్వహించారు. ఒకవేళ డీఈడీ, బీఈడీ.. రెండు అర్హతలు ఉంటే పేపర్‌-1 మరియు పేపర్‌-2 రాసుకోవచ్చు. ఇప్పుడు ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకూ అవకాశం కల్పించడంతో, టెట్‌ పేపర్‌-1లో అర్హత లేని వారిని ఏం చేయాలన్న విషయంపై స్పష్టత కొరవడింది. గెజిట్‌ నోటిఫికేషన్‌పై ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోవాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై రెండు రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులు నిర్ణయించారు.

ఏపీఆర్‌సెట్‌-2018 రుసుము తగ్గింపు

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో పీహెచ్‌డీ, ఎంఫిల్‌ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న ఏపీఆర్‌సెట్‌-2018 రుసుమును తగ్గించినట్టు కన్వీనర్‌ శ్రీనివాసరావు తెలిపారు. జనరల్‌ విద్యార్థులకు రూ.1400 నుంచి 1300కు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ లకు రూ.వెయ్యి నుంచి 900గా ఫీజును తగ్గించినట్టు పేర్కొన్నారు.

సెట్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఎపి పిజిసెట్‌,ఎపిఎడ్‌సెట్‌, ఎపి లాసెట్‌, ఎపి ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. సెట్ల అడ్మిషన్ల కమిటీ ఎపి ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం జరిగింది. అనంతరం సెట్ల షెడ్యూలలను విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి 14 వరకు ఎపిఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ఉంటుందని, సీట్ల కేటాయింపు 16న కేటాయిస్తారు. ఎపి పిజి ఈసెట్‌ (గేట్‌,జిపిటిఎ)కౌన్సెలింగ్‌ ఈ నెల 18,19 తేదిల్లో, 20న సీట్ల అలాట్‌మెంట్‌ ఉంటుంది.ఎపిజి ఈసెట్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 23 నుంచి 27 వరకు, సీట్ల అలాట్‌మెంట్‌ 28న ఉంటుంది. ఎపి లాసెట్‌ కౌన్సెలింగ్‌ ఆగస్టు 2, 3 తేదిల్లో సీట్ల అలాట్‌మెంట్‌ 4న విడుదల చేస్తారు.ఎపిపిఈసెట్‌ కౌన్సెలింగ్‌ ఆగస్టు 6,7 తేదిల్లో , 9న సీట్ల అలాట్‌మెంట్‌ కేటాయిస్తారు.

తప్పుల తడకగా ఇ-పేమెంట్లు

సిఎఫ్‌ఎంఎస్‌లో రెండు నెలల్లోనే 25 వేల చెల్లిరపుల్లో అక్రమాలు
- అదనంగా రూ.141 కోట్ల చెల్లింపు
- సర్కారుకు వెల్లడించిన ఆర్‌బిఐ
సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (సిఎఫ్‌ఎంఎస్‌) ద్వారా నిర్వహిస్తున్న లావాదేవీల్లో భారీగా తప్పులు బయటపడుతున్నాయి. దీనివల్ల రాష్ట్ర ఖజానా పరిస్థితి ఆరదోళనకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 25 వేల వరకు ఖాతాల్లో ఇటువంటి తప్పుడు చెల్లిరపులు బయటపడ్డాయి. స్వయంగా రిజర్వ్‌ బ్యారకు ఈ సమాచారాన్ని వెల్లడిరచిరది. దీనివల్ల ఖాతాదారులు కూడా ఇబ్బరదులు పడుతున్నట్లు ఆక్షేపిరచిరది. కేంద్రం అమలు చేస్తున్న ఇ-కుబేర్‌తో సిఎఫ్‌ఎంఎస్‌ను అనుసంధానం చేయడం వల్ల ఈ తప్పులను రిజర్వ్‌బ్యారకు గుర్తిరచగలిగిరది. ఒక లబ్ధిదారునికి ఒకసారే చెల్లిరచాల్సిన మొత్తాన్ని రెరడు మూడు పర్యాయాలు చెల్లిరచేస్తున్నారు. ఇ-పేమెరట్ల ద్వారా ఇప్పటివరకు 18 సందర్భాల్లో ఏకంగా పాతిక వేల వరకు ఖాతాల్లో తప్పుడు చెల్లిరపులు, డబుల్‌ చెల్లిరపులు జరిగినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖకు ఆర్బీఐ ఒక లేఖ రాసిరది. ఈ తప్పుల విలువ రూ.141 కోట్ల వరకు ఉన్నట్లు గుర్తిరచామని పేర్కొరది. ఈ మొత్తం లావాదేవీ లన్నిరటినీ ఇదేవిధంగా తనిఖీ చేస్తే అవకతవకలు ఇరకా భారీగా ఉరడవచ్చునని ఆర్‌బిఐ పేర్కొనడం గమనార్హం. వివిధ సాఫ్ట్‌వేర్ల నురచి సిఎఫ్‌ఎంఎస్‌కు డేటా మార్పిడి సమయంలో సరైన విధానాలను అనుసరిరచకపోవడర వల్లనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు అభిప్రాయపడిరది.. బ్యారకుల్లో జరిగిన ఈ తప్పులను తాము పరిష్కరిస్తూ తిరిగి ఆయా అదనపు చెల్లిరపులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేసేరదుకు చర్యలు తీసుకురటున్నామని పేర్కొరది. ఇలారటి తప్పులు అత్యరత ప్రమాదకరంగా మారి, అకౌరటెంట్‌ జనరల్‌ కార్యాలయం, రాష్ట ప్రభుత్వానికి సమస్యలు సృష్టిరచే పరిస్థితి ఉరటురదని కూడా హెచ్చరికలు జారీ చేసిరది. అనేక బ్యారకులు అదనపు మొత్తం రికవరీలపై సుముఖత వ్యక్తం చేయడం లేదని కూడా ఆరోపిరచిరది. దీనివల్ల రాష్ట్ర ఖజానా తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉరదని హెచ్చరిరచిరది

- గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆటంకం
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సిఎఫ్‌ఎంఎస్‌తో గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,918 పంచాయతీలు ఉండగా ప్రతి సర్పంచికి సిఎఫ్‌ఎంఎస్‌ ఐడి, పాస్‌వర్డ్‌ క్రియేట్‌ పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు అందించాల్సి ఉండగా నేటికీ కొందరికి అవి అందించలేదు. మరోవైపు ఐడి, పాస్‌వర్డు పొందిన సర్పంచులూ ఈ లావాదేవీల విషయంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని పంచాయతీలకు ఎన్నిసార్లు వివరాలు అప్‌లోడ్‌ చేసినా నిధుల విడుదల కావడం లేదు. దీంతో నెలల తరబడి సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

అటు మోదం..ఇటు ఖేదం..

*♦- హర్షం వ్యక్తం చేస్తున్న బిఇడి అభ్యర్థులు*
*♦- నిరసన తెలియజేసిన టిటిసి అభ్యర్థులు*
🌻సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జిటి) పోస్టులలో బిఇడి చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ ఎస్‌సిటిఇ విడుదలైన గజిట్‌ పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
🌻ఇదే సమయంలో టిటిసి అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. ఎన్‌సిటిఇ విడుదల చేసిన గజిట్‌ పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎస్‌జిటి పోస్టులలో బిఇడి అభ్యర్థులు అవకాశం ఉండేది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో గత రెండు పర్యాయాలు నిర్వహించిన డిఎస్‌సిలో ఎస్‌జిటి పోస్టులను 100 శాతం టిటిసి అభ్యర్థులతోనే భర్తీ చేశారు.
ఎస్‌జిటి పోస్టులలో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బిఇడి) అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌సిటిఇ) సవరించిన గజిట్‌ పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
🌻 ఎస్‌జిటి పోస్టులకు అవకాశం లేక గత మూడు పర్యాయాలుగా బిఇడిలు చేసిన వారు నష్టపోయారని నిరుద్యోగ అభ్యర్థులు పేర్కొంటున్నారు. 2008 డిఎస్‌సిలో 30 శాతం ఎస్‌జిటి పోస్టులను డిఇడి చేసిన అభ్యర్థులకు కేటాయించారు. 70 శాతం పోస్టులకు బిఇడి, డిఇడి చేసిన అభ్యర్థులు వారు పోటీపడేవారు. 2010 సుప్రీం కోర్టు తీర్పు 100 శాతం ఎస్‌జిటి పోస్టులను డిఇడి అభ్యర్థులకు కేటాయించాలని తీర్పు ఇచ్చింది.
🌻ఈ నేపథ్యంలో 2012 డిఎస్‌సి నుండి ఎస్‌జిటి పోస్టులను డిఇడి కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులతో భర్తీ చేస్తున్నారు. బిఇడి చేసిన అభ్యర్థులు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు మాత్రమే పోటీపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తరువాత 2014లో నిర్వహించిన డిఎస్‌సిలో సైతం 100 శాతం ఎస్‌జిటి పోస్టులను డిఇడి కోర్సు చదివిన వారికి మాత్రమే కేటాయించి భర్తీ చేశారు. ప్రస్తుతం ఎన్‌సిటిఇ తీసుకున్న నిర్ణయంలో లక్షలాది మంది బిఇడి చేసిన అభ్యర్థులు మేలు చేకూరనుంది.
🌻 బిఇడి కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్ధులు ఎస్‌జిటితో పాటు స్కూలు అసిస్టెంట్‌ పోస్టులకు పరీక్షలు రాసుకునే అవకాశం దక్కింది. ఎస్‌జిటి పోస్టు పొందిన అభ్యర్థులు ఆరు నెలల బ్రిడ్జి కోర్సు చేయాలని ఎన్‌సిటిఇ సూచించింది.

*♦డిఇడి అభ్యర్థుల నిరసన*
ఎస్‌జిటి పోస్టులలో బిఇడి అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ ఎన్‌సిటిఇ గజిట్‌ విడుదల చేయటం పట్ల పలువురు డిఇడి అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్ధానిక కలెక్టరేట్‌ వద్ద బుధవారం పలువురు టిటిసి అభ్యర్థులు నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు నినాదాలు చేశారు. కలెక్టరేట్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలియజేశారు.

*♦బిఇడి అభ్యర్థుల హర్షం*
ఎస్‌సిటిఇ నిర్ణయాన్ని బిఇడి అభ్యర్ధులు స్వాగతిస్తున్నారు. గత మూడు పర్యాయాలు కోల్పోయిన అవకాశాలు ఈ నిర్ణయంతో మళ్లీ బిఇడి చేసిన వారికి దక్కనున్నాయని నిరుద్యోగ అభ్యర్థులు పేర్కొంటున్నారు. నిరుద్యోగ యువత వారి అభిప్రాయాలను వెల్లడించారు.. అవి వారి మాటలల్లోనే...

విశాఖలో ‘డిజైన్‌ యూనివర్సిటీ’

🌻విశాఖకు మరో మణిహారం రానుంది. గేమింగ్‌ ప్రపంచాన్ని శాసించేలా ‘డిజైన్‌ యూనివర్సిటీ’ నెలకొల్పేందుకు యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌, కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) ముందుకొచ్చింది. ‘గేమింగ్‌-డిజిటల్‌ లెర్నింగ్‌ హబ్‌’ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికా భివద్ధి బోర్డు(ఏపీఈడీబీ)తో ఒప్పం దం కుదుర్చుకున్న యునెస్కో ప్రతినిధి బందం బుధవా రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది.
🌻 విశాఖను ఇంటర్నేషనల్‌ గేమింగ్‌, డిజిటల్‌ లెర్నింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందు కోసం 100 ఎకరాల భూమిని కేటాయించాలని యునెస్కో బందం ముఖ్యమంత్రిని కోరింది. భవిష్యత్‌లో గేమింగ్‌ టెక్నాలజీ ఉత్తమ ఆదాయ వనరుగా వుంటుందని, యుబీ సాఫ్ట్‌, శాంసంగ్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అత్యుత్తమ సంస్థలు సైతం తమ సెంటర్లు ఇక్కడ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని యునెస్కో ప్రతినిధులు తెలిపారు.
🌻 10 ఏళ్లలో 50 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఎడ్యుటెక్‌ గేమింగ్‌ను అభివ ద్ధి చేస్తామని, మొత్తం భారతదేశంలోని గేమింగ్‌ మార్కెట్‌లో 25 శాతం ఏపీ నుంచే ఉంటుందని ముఖ్యమంత్రికి యునెస్కో ప్రతినిధులు వివరించారు. లెర్నింగ్‌ డిస్‌ఎబిలిటీతో బాధపడే చిన్నారులకు ప్రత్యేక విద్యా బోధన, స్టార్టప్‌లకు వెంచర్‌ ఫండ్‌ అందివ్వడం, ఇంక్యుబేషన్‌ సెంటర్లు, గ్లోబల్‌ రీసెర్చ్‌ సెంటర్‌, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌లో గ్లోబల్‌ సర్టిఫికేషన్‌ బ్యూరో, గేమింగ్‌-డిజిటల్‌ టీచర్‌ ట్రైనింగ్‌ అకాడమీ, గేమింగ్‌-డిజిటల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అకాడమీ ఈ హబ్‌లో భాగంగా ఉంటాయని వెల్లడించారు
🌻 ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్‌ ఎకానమీ-ఇన్నోవేషన్‌ వ్యాలీగా అభివద్ధి చేయాలని, గేమింగ్‌ టెక్నాలజీని అన్ని రంగాల్లోనూ వినియోగించేలా విస్తత పరచాలని యునెస్కో బందానికి ముఖ్యమంత్రి సూచించారు. విద్యా ప్రమా ణాలు రూపొందించి ‘వైజాగ్‌ డిక్లరేషన్‌’గా ప్రాచుర్యం కల్పించాలన్నారు. సమావేశంలో ముఖ్య మంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, ఏపీఈడీబీ సీఈవో జాస్తి కష్ణ కిషోర్‌, యునెస్కో ఎంజీఐఈపీ ప్రతినిధులు అనంత దొరైయప్ప, నందిని చటర్జీ, అర్చనా చౌదరి, నాట్‌ మలుపిళ్లై, డాక్టర్‌ మనోజ్‌ సింగ్‌ పాల్గొన్నారు.

టీచర్‌ పోస్టుల కోసం ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు*_

*🌻పాట్నా :* బీహార్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 4,257 గెస్ట్‌ టీచర్స్‌ పోస్టుల కోసం ఇంజనీరింగ్‌, పిహెచ్‌డి చేసిన సుమారు ఐదు లక్షలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తాము అంచనా వేసుకున్న దానికన్నా ఎక్కువ మంది దరఖాస్తు చేశారని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ చంపారన్‌లోని రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎమ్‌ఎస్‌ఎ) గత నెలలో గెస్ట్‌ టీచర్స్‌ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
🌻జూన్‌ 15 చివరితేదీగా ప్రకటించింది. దరఖాస్తు చేసిన వారిలో దాదాపు 80 శాతం మంది ఇంజనీరింగ్‌ చేసినవారు కాగా ఎక్కువగా బిటెక్‌, ఎంటెక్‌ డిగ్రీ పొందినవారూ ఉన్నారు. మొత్తం 4,257 ఖాళీలలో 1041 ఖాళీలు ఇంగ్లీష్‌ విభాగంలో, 791 ఖాళీలు లెక్కల విభాగంలో, 1024 పోస్టులు ఫిజిక్స్‌లో, 974 ఖాళీలు కెమిస్ట్రీలో ఉన్నాయి.
🌻137 ఖాళీలు జువాలజీ విభాగంలో ఉండగా, 290 ఖాళీలు బోటనీలో ఉన్నాయని, వీటిని భర్తీ చేయనున్నామని అధికారులు తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొనేందుకు గెస్ట్‌ టీచర్స్‌ను నియమించాలని బీహార్‌ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Tags