Type Here to Get Search Results !

FAPTO రేపు తలపెట్టిన DMA వద్ద ధర్నా తాత్కాలిక వాయిదా

మిత్రులారా! FAPTO Message:
మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై Fapto ప్రభుత్వానికి నోటీసును సమర్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ ( DMA ) గారు వారి సిబ్బంది Fapto తో నేడు చర్చలు జరిపారు.
  • జి.ఓ: 506 లో మిగిలిన 317 ఉపాధ్యాయుల పూర్తి వివరాలను నేడు అన్ని ఆర్డీ ల నుండి తెప్పించడం జరుగుతుంది. రేపు DMA ప్రభుత్వానికి పంపుతామన్నూరు.
  • జి.ఓ:507 లో Fapto సూచించిన సవరణలతో కూడిన DMA ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతూ Proposal కాపీని Fapto కు అందజేశారు.
  • పి.ఎఫ్ గైడ్లైన్స్ proposal కాఫీ ని FAPTO కు అందజేశారు.
  • పిఈటీ పదోన్నతుల షెడ్యుల్ ను ఈరోజు లేదా రేపు జారీ చేస్తారు.
  • ULB ల కో ఆర్డినేటర్ ల జాబ్ చార్ట్ జారికి సుముఖం
  • వర్క్ అడ్జస్ట్మెంట్ లో అక్రమాలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని DMA తెలిపారు.
  • ఇంకా అనేక సమస్యలపై స్పష్టత నివ్వడం జరిగింది.
  • సమస్యలపై DMA గారు fapto సమస్యల పరిష్కారినికై ఇచ్చిన హామీల మేరకు FAPTO  రేపు తలపెట్టిన DMA వద్ద ధర్నాను తాత్కాలికంగా వాయిదా వేయడమైనది.
  • ఈ చర్చల్లో చైర్మన్ పి.బాబురెడ్డి, సెక్రెటరీ జనరల్ జి.హృదయరాజు, కో చైర్మన్స్ జి.నాగేశ్వరరావు, NV రమణయ్య, డిప్యూటీ సెక్రటరీ జనరల్ యం. రవిచంద్ర కుమార్, ఏపీజేఏసీ సెక్రెటరీ జనరల్ సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, కార్యవర్గసభ్యులు N.రఘురామిరెడ్డి లు పాల్గొన్నారు
- చైర్మన్ & సెక్రెటరీ జనరల్, FAPTO
Tags