విద్యార్థులపై సమ్మెటివ్ పోటు!
6 నుంచి 9 తరగతుల పరీక్షల సరళిపై సందిగ్ధం - ఓఎంఆర్ విధానానికే విద్యాశాఖ మొగ్గు.?♦ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. తేలని స్పష్టత
♦ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం
పాఠశాలలు పునః ప్రారంభమై నెల రోజులు అవుతోంది. చాలా చోట్ల పాఠ్యపుస్తకాల సరఫరా పూర్తి కాలేదు.
మరోవైపు ఈ నెల 27నుంచి నిర్మాణాత్మక మూల్యాంకనం (ఎఫ్‌ఏ)-1 పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ ప్రధానోపాధ్యాయులకు నిర్దేశించింది. గతేడాది 6 నుంచి 9 తరగతులకు మాదిరిగానే ఈ ఏడాది నుంచి ప్రాథమిక తరగతులకు కూడా ఎస్‌ఏ పరీక్షలు రెండే ఉంటాయని ఇప్పటికే విద్యాశాఖ వార్షిక ప్రణాళికలో పేర్కొంది. 6 నుంచి 9 తరగతులకు నవంబరు రెండో వారంలో జరిగే ఎస్‌ఏ పరీక్షల నిర్వహణ విషయమై తరగతి గదుల్లో గందరగోళం నెలకొంది. గతేడాది మాదిరిగా పరీక్షల నిర్వహణకు ఓఎంఆర్ విధానం కొనసాగించడానికే ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.
మరోవైపు ఓఎంఆర్ విధానం అమలుపై ఉపాధ్యాయసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పరీక్షల సరళిపై స్పష్టత కొరవడడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు సందిగ్ధంలో ఉన్నారు.
పరీక్షల పరిణామక్రమం ఇదీ..
పాఠశాల తరగతి గదుల్లో గతంలో త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక అంటూ మూడు దశలుగా పెద్ద పరీక్షలు జరిగేవి. నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానం అమలుతో వాటి స్థానంలో సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్‌ఏ) పేరుతో మూడు పెద్ద పరీక్షలను నిర్వహించారు. పదోతరగతికి కూడా సీసీఈ అమలు చేస్తున్నామంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి పరీక్షల విధానంలో విద్యార్థులకు పరీక్షలు పెట్టారు. గతేడాది ఎస్‌ఏ-1 పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో 8, 9 పరీక్షలను రద్దు చేశారు.
సుదీర్ఘ విరామం తర్వాత ఓఎంఆర్ విధానంలో బహుళైచ్ఛిక జవాబుల ప్రశ్నపత్రాలతో పరీక్షలను నిర్వహించారు. ఇదే విధానాన్ని వచ్చే ఏడాది నుంచి 6, 7 తరగతులకు కూడా అమలు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆ పరీక్షల ఫలితాలు ఏమయ్యాయో అన్నది ఇప్పటి వరకు జవాబు లేని ప్రశ్నగానే మిగిలింది. ఈ నేపథ్యంలో వార్షిక పరీక్షలను అంతకుముందు విధానంలో సాధారణ ప్రశ్నపత్రాలతోనే నిర్వహించడం విశేషం.
*♦అదే పెద్ద పరీక్ష ...*
సాంకేతిక విధానాల అమలుతో మూల్యాంకనంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నిరుడు కాంప్లెక్సుస్థాయిలో పునర్ మూల్యాంకనం చేశారు. గతేడాది ఆ విధానానికి స్వస్తి పలికారు. కొత్త విధానానికి తెరతీసిన విద్యాశాఖ 8, 9 తరగతుల ఎస్‌ఏ-1 పరీక్షల ఫలితాలను విద్యార్థులకు అందజేయడంలో వెనుకంజ వేసింది. చివరకు పరీక్షల నిర్వహణే పెద్ద పరీక్షగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రైమాసిక, అర్థ సంవత్సర పరీక్షల తరహాలోనే ఎస్‌ఏ పరీక్షలను ఉమ్మడి ప్రశ్నాపత్రాలతో నిర్వహించి పాఠశాల స్థాయిలోనే మూల్యాంకనం చేయడం సర్వత్రా ఆమోదయోగ్యంగా ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి.

ఎస్‌ఏ పరీక్షలను ఓఎంఆర్ విధానంలో కొనసాగించేందుకే ఉన్నతాధికారులు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. గతేడాది తలెత్తిన సాంకేతిక అవరోధాలను అధిగమిస్తూ ఓఎంఆర్ విధానం అమలు చేయాలని యోచిస్తున్నట్లు పరీక్షల విభాగం యంత్రాంగం చెబుతోంది. ఓఎంఆర్ విధానం వలన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు కుంటుపడతాయని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.
♦ప్రాథమిక తరగతులకు రెండు ఎస్‌ఏలు
సీసీఈ విధానం అమలు నేపథ్యంలో ప్రాథమిక తరగతులకు మూడు ఎస్‌ఏలకు బదులు ఇక రెండు ఎస్‌ఏ పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ పాఠశాల వార్షిక ప్రణాళికలో పేర్కొంది. దీంతో సెప్టెంబరులో జరగాల్సిన ఎస్‌ఏ-1 పరీక్షలు నవంబరు రెండోవారంలో జరుగుతాయి. ఇక వార్షిక పరీక్షలే ఎస్‌ఏ-2 పరీక్షలుగా జరుగుతాయి. 6 నుంచి 9 తరగతులకు గతేడాది ఇదే విధానాన్ని అమలు చేయడం తెలిసిందే. అంటే నవంబరు వరకు విద్యార్థులకు పెద్ద పరీక్షల బెడద ఉండదన్న మాట.

♦పరీక్షలపై స్పష్టత అవసరం.
విద్యార్థుల అభ్యసనసామర్ధ్యాలను మదింపు చేయడానికి మూల్యాంకనం తప్పనిసరి. వారి ప్రతిభను అంచనా వేయడంలో సంగ్రహణాత్మక మూల్యాంకనం ఫలితాలదే ప్రధాన పాత్ర. ఆ పరీక్షల సరళిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. నిర్మాణాత్మక మూల్యాంకనం పరీక్షలు పాఠశాల స్థాయిలోనే ఉంటాయి. కానీ ఎస్‌ఏ పరీక్షలు ఉమ్మడి పరీక్షలు. దీనిపై ఏ విధానాన్ని అనుసరించాలో విద్యాశాఖ స్పష్టం చేయకపోతే మళ్లీ గందరగోళం తప్పదు.

♦పరీక్షల సరళిపై త్వరలో మార్గదర్శకాలు
గతేడాది వార్షిక పరీక్షల మాదిరిగానే ఎస్‌ఏ-1 పరీక్షలు ఉంటాయని భావిస్తున్నాం. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారుల చర్యలు ఉంటాయి. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు అందుతాయని ఆశిస్తున్నాం.- సీవీరేణుక, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు.

♦ఓఎంఆర్‌విధానం కొనసాగింపునకు ప్రతిపాదనలు
సంగ్రహణాత్మక మూల్యాంకనం పరీక్షలను ఓఎంఆర్ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. గతంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించి మెరుగైన రీతిలో పరీక్షలను నిర్వహించాలన్నదే ఉద్దేశ్యం. ఉపాధ్యాయ సంఘాల నుంచి దీనిపై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ తుది నిర్ణయం మేరకు పరీక్షలను నిర్వహిస్తాం.
*- డి.మధుసూదనరావు, ఎస్‌సిఈఆర్‌టీ డైరెక్టరు, అమరావతి.*