Type Here to Get Search Results !

సుప్రీం, హైకోర్టు తీర్పులు తరువాతే మలివిడత కౌన్సెలింగ్

సుప్రీం, హైకోర్టు తీర్పులు తరువాతే మలివిడత కౌన్సెలింగ్


ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రవేశాలకు జాతీయ స్థాయిలో జరిగిన కౌన్సెలింగ్లో ఓబీసీ విద్యా ర్థులకు అన్యాయం జరుగుతోందన్న దానిపై సుప్రీం కోర్టులో, రాష్ట్రంలో 550 జీఓ అమలుపై నెలకొన్న వివా దంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. దీనివల్ల మలివిడత కౌన్సెలింగ్ పై అనిశ్చితి నెలకొంది. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం తొలివిడత కౌన్సెలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేసింది. మలివిడత కౌన్సెలింగ్ నిర్వ హణకు సిద్దమవుతున్న తరుణంలో పై ఇబ్బందులు తలెత్తాయి. అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15% సీట్లను కేంద్రం నేరుగా భర్తీ చేస్తోంది. ఇందులో ఓబీసీ సీట్ల భర్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. దీంతో జాతీయ స్థాయిలో 15% సీట్ల భర్తీకి మలివిడత కౌన్సెలింగ్ జరగలేదు. ఈ కౌన్సెలిం గ్లో భర్తీ కాకుండా మిగిలిన సీట్లను రాష్ట్రాలకు పంపు తారు. రాష్ట్రం భర్తీ చేయాల్సిన సీట్లతో వాటిని కలుపు కుని మలివిడత కౌన్సెలింగ్ ను చేపట్టాల్సి ఉండగా.. రాష్ట్రంలో 550 జీఓ అమలు వ్యవహారం వివాదాస్పద మైంది. దీనిపై హైకోర్టులో విచారణ సాగుతోంది. ఈ సందర్భంగా జారీ చేసిన ఆదేశాలను అనుసరించి 550 జీఓ ప్రభావం గురించి హైకోర్టుకు విశ్వవిద్యాలయం నివేదించింది. వచ్చే వారంలో ఈ రెండు అంశాలపై న్యాయస్థానాల నుంచి స్పష్టత వస్తుందని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ సీవీరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేటులో సీట్లు ఇప్పిస్తామంటూ దళారులు. 
మరోవైపు... దళారులు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీట్లు ఇప్పిస్తామని విద్యార్థులకు గాలం వేస్తున్నారు. దీనిపై మెడికల్ కౌన్సెల్ కమిటీ ప్రకటన జారీ చేసింది. దళారుల మాటలు నమ్మవద్దని, ప్రతిభ ఆధారంగానే అన్ని రకాల సీట్లు భర్తీ జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విశ్వవిద్యాలయాలు, వైద్య కళాశాలలకు లేఖలు పంపింది.

ముగిసిన ఈ సెట్ తుదివిడత కౌన్సెలింగ్

ఇంజినీరింగ్, ఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించే ఈ సెట్ కౌన్సెలింగ్ రెండో విడత శనివారం ముగిసింది. ఈ సెట్లో 88,088 మంది అర్హత సాధిం చగా.. వీరిలో 88,386 మంది ప్రవేశాలకు ఐచ్చి కాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 57,394 సీట్లు ఉండగా.. వీటిలో 21,248 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంజి నీరింగ్లో మొత్తం 55,966 సీట్లు ఉండగా.. 21,122 సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మసీలో 1,428 సీట్లు ఉండగా.. కేవలు 126 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రవేశాలు పొందిన అభ్యర్థులు వచ్చే నెల రెండో తేదీలోపు కళాశాలల్లో ప్రవేశాలు పొందాల్సి ఉంటుందని కన్వీనర్ పండాదాస్ తెలిపారు.