పాపం త్రిపుర ప్రజలు అడ్డంగా బుక్ అయ్యారు.
July 1st నుంచి త్రిపుర రాష్ట్రంలో CPS విదానాన్ని అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపారంట. ఇన్నాళ్లూ సీపీయస్ అమలు కాని రాష్ట్రాలు కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర అని చెప్పుకునే వాళ్లం 2013 లో కాంగ్రెస్ ప్రభుత్వం కేరళ లో CPS విధానం పెట్టాక రెండే మిగిలాయి. పోనీ వాటిని కొన్నాళ్లు ఉదాహరణ గా చెప్పుకునే వాళ్లం. ఇప్పుడు త్రిపురలో BJP దయవల్ల CPS విధానం అమలు కాబోతుంది.ఇక మిగిలేది పశ్చిమ బెంగాల్ ఒక్కటే అదైనా ఉదాహరణ గా మిగలాలంటే అక్కడ BJP గానీ కాంగ్రెసు గానీ రాకూడదు.
ఇకపోతే 2003 నవంబర్ లో CPS విధానం అమలుకు ఒక నోట్ విడుదల చేసింది BJP. మరియు చాలా రాష్ట్రాల్లో వాళ్లు అధికారంలో ఉండి CPS విదానాన్ని అమలు చేస్తే BJP అనుబంధ సంఘం అయిన ఆపస్(APUS) సంఘం వాళ్లు మేము CPS రద్దుకు పోరాడుతున్నాము సీపీయస్ రద్దు చేయించేస్తాము అంటే కొంతమంది అమాయకులు నమ్మేస్తున్నారు కార్పోరేట్ శక్తుల చేతుల్లో నడుస్తున్న ఏ పార్టీ కూడా CPS విదానాన్ని రద్దు చేయడానికి ఇష్టపడదు. కాదు కాదు ఇష్టపడనివ్వరు
కొసమెరుపు ఏంటంటే CPS కి మేము వ్యతిరేకమని మొదట్నుంచీ చెప్పుకుంటున్న CPM, CPI (LDF) లు పాలిస్తున్న కేరళలో 2016 MAY నుంచి ఈనాటికీ CPS రద్దు చేయలేకపోయినవి. కారణం ఏంటనేది ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఆ చిక్కు ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
కనీసం కేరళ లో అయినా CPS రద్దు అయితే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒక ఉదాహరణగా చెప్పుకుని CPS రద్దు కొరకు డిమాండ్ చేయడానికి బాగుంటుందని ఆశిస్తున్నా ఆ కల నెరవేరడం లేదు.
ఏదిఏమైనా సీపీయస్ రద్దు కొరకు మనం బలమైన చిత్తశుద్ధి కలిగిన ఐక్య ఉద్యమాలు చేయాల్సిందే..బలమైన పోరాటాలు ద్వారానే CPS రద్దు చేయించుకోగలం. ఇందులో లాబీయింగ్ కి ఏమాత్రం అవకాశం లేదు
CPS సంఘాలు కూడా ప్రెస్టేజీ కోసమో, గుర్తింపు కోసమో పాటుపడకుండా ఒకరిని ఒకరు విమర్శించుకోకుండా CPS రద్దు కోసం మాత్రమే పాటుపడితే బాగుంటుంది.అవసరమైతే CPS సంఘాలు కూడా CPS సంఘాల ఐక్య వేదిక గా ఏర్పడాలి. ఐక్య ఉద్యమాలలో కలసి పోరాడాలి.సమస్య సాధనే ముఖ్యమనుకుంటే ఈ ఫాల్స్ ప్రెస్టేజీలకు తావు ఉండదు.
ఇప్పుడు FAPTO ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న CPS జాతాలో,నిజంగా CPS రద్దు కోరుకొనే అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యక్ష మద్దుతు తెలిపి భౌతికంగా జాతా ఉద్యమంలో పాల్గొని ఐక్య ఉద్యమాల సత్తా ఏంటో ప్రభుత్వానికి రుచి చూపించాలని కోరుకుంటూ....