Type Here to Get Search Results !

ఇంజినీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల రుసుముల పెంపుపై కసరత్తు!


వృత్తి విద్యా కోర్సుల రుసుముల పెంపుపై కసరత్తు! 

వచ్చే విద్యా సంవత్సరం నుంచి వృత్తి విద్యా కోర్సుల బోధన రుసు ములు పెంచే ప్రక్రియను... ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) చేపట్టింది. బోధన రుసుములు పెంపునకు సంబంధించి ముందుస్తు కసరత్తు సమావేశాన్ని వచ్చే నెల రెండో తేదీన నిర్వహించాలని ఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ముగ్గురు ఉపకులపతులు, ఆడిటర్లు హాజరుకానున్నారు. ఈ కమిటీ సమావేశం అనంతరం నోటిఫికేషన్లు జారీ చేస్తారు. అనంతరం కళాశాలలు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి మూడేళ్లకోసారి ఏఎఫ్ఆర్సీ బోధన రుసుములను సవరిస్తూ, ఉంటుంది. గతంలో పెంచిన రుసుముల గడువు ఈ ఏడాదితో ముగియనుంది. రెండేళ్ల క్రితం ఇంజినీరింగ్ బీటెక్కు రూ. 35వేలు నుంచి రూ.1.08లక్షలు, ఎంటెక్కు రూ. 51వేలు, ఎం ఫార్మసీ రూ.1.10లక్షలు, ఫార్మా డీ(పోస్టు బ్యాచిలర్)కు రూ. 68వేలు, ఎంబీఏ, ఎంసీఏలకు రూ.21వేలు చొప్పున రుసుములను నిర్ణయించింది. తమ పిల్లల్ని ఈ కోర్సులు చదివించాలనుకునే తల్లిదం డ్రులపై ఎంతోకొంత ఆర్ధిక భారం పడనుంది. ఇప్పటికే కళాశాలలు ఇస్తున్న నివేదికలపై క్షేత్ర స్థాయిలో తనిఖీలు, పరిశీలనలు జరగడంలేదన్న ఆరోపణలున్నాయి. కొన్ని కళాశాలలు అధ్యా పకులకు చెల్లిస్తున్న వేతనాలకు, ఏఎఫ్ఆర్సీకి సమర్పిస్తున్న దానికి పొంతన ఉండడం లేదు.