Type Here to Get Search Results !

‘కాంట్రాక్టు’ సమస్యలు త్వరలో పరిష్కారం: గంటా

‘కాంట్రాక్టు’ సమస్యలు త్వరలో పరిష్కారం: గంటా
విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవా లని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పాఠశాల స్థాయి నుంచి వర్సిటీల వరకు పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కా రంతో పాటు తగిన లబ్ధి చేకూర్చే ప్రణాళికలు ఇవ్వాలని ఆదేశించారు. మంగళవారం ఆయన విద్యాశాఖాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
విద్యార్థుల శ్రేయస్సు, వినూత్న సంస్కరణల అమలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీ.. తదితర అంశాలపై చర్చించా రు. కొన్ని చోట్ల ఇంకా పుస్తకాలు అందలేదన్న అంశంపై మంత్రి అధికారులను వివరణ అడిగారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్ఠం గా అమలు చేయాలన్నారు. కేజీబీవీల్లో ప్రవేశాలకు మంచి డిమాండ్‌ ఉన్న రీత్యా మరింత మందికి ప్రవేశాలు కల్పించాలన్నారు. బాలికా విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కొత్త పాలిటెక్నిక్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు.
Tags