Type Here to Get Search Results !

ఉర్దూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ

ఉర్దూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ

నేడు నోటిఫికేషన్.. ఈనాడు, అమరావతి: జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ప్రకటన (నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో ఖాళీగా ఉన్న 211 ఉర్దూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వ హించనున్నారు. ప్రత్యేక డీఎస్సీ నిర్వహిం చేందుకు ప్రభుత్వం అనుమతించిన నేప థ్యంలో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సాధారణ డీఎస్సీ ఎప్పుడు? సాధారణ డీఎస్సీ ప్రకటన వెలువడక పోవడంతో అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గతంలో రెండు పర్యా యాలు మంత్రి గంటా శ్రీనివాసరావు షెడ్యూల్ ను ప్రకటించారు. నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 10,851 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. డీఎస్సీ షెడ్యూల్ వెల్లడి తర్వాత రెండు పర్యాయాలు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించిన అధికారులు నోటిఫి కేషన్ మాత్రం ఇవ్వడం లేదు. 
Tags