Type Here to Get Search Results !

అన్ని పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యకు ఔట్‌ సోర్సింగ్‌ ఫ్యాకల్టీ

విద్యాశాఖకు చంద్రబాబు తాజా ఆదేశాలు..

అమరావతి: అన్ని పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య బోధించేందుకు ఔట్‌ సోర్సింగ్‌ ఫ్యాకల్టీని నియమించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విద్యాశాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాలను చేపట్టాలని చెప్పారు. అలాగే ప్రతీ పాఠశాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు.
Tags