Type Here to Get Search Results !

CPS రద్దు చేస్తారా ?? తొలిగి పోతారా - FAPTO చైర్మన్ బాబు రెడ్డి

CPS రద్దు చేస్తారా ?? తొలిగి పోతారా - FAPTO చైర్మన్ బాబు రెడ్డి 


ఆంగ్లేయుల దోపిడీని ఎదుర్కొనేందుకు 1942 ఆగస్టు 9న 'క్విట్ ఇండియా ఉద్యమం' జరిగింది. ఆ సమయంలో దేశమంతా 'క్విట్ ఇండియా' నినాదం మార్మోగింది. అంతే కాదు ఈ విప్లవాన్ని 'ఆగస్టు మాసం విప్లవం'గా కూడా పిలుస్తారు.
అదే స్ఫూర్తితో రాష్ట్రంలో మరలా క్విట్ సిపిఎస్' నినాదంతో ఫ్యాప్టో జాతాలు ప్రారంభమవుతున్నాయి. సిపిఎస్ భూతాన్ని తరిమి కొట్టాలని ఉద్యోగులు, ఉపాధ్యాయు లు ఉద్యమిస్తు న్నారు.
ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గిన పాలక వర్గాలు ఉద్యోగులకు పెన్షన్ రద్దు చేసి నూతన పెన్షన్ విధానం అమలు చేస్తూ చట్టాలు చేశారు. ఉద్యోగుల నుండి వసూలు చేసే కాంట్రిబ్యూషస్ తో పాటు ప్రభుత్వ వాటా జత చేసి షేర్ మార్కెట్లో కార్పొరేట్ల ప్రయోజనం కోసం పెట్టుబడులు రెడ్డి పెడుతున్నారు.
దీంతో తమ జీతాల నుండి ఉద్యోగులు 10 శాతం కాంట్రిబ్యూషన్ చెల్లించినప్పటికీ రిటైర్ మొంట్ తర్వాత పెన్షన్ గ్యారెంటీ లేని పరిస్థితి ఏర్పడింది. 2004 ముందు వరకు ఉద్యోగంలో చేరిన వారికి, వారి చివరి జీతంలో సగం రిటైర్మెంట్ తర్వాత పెన్షన్గా చెల్లించేవారు. అయితే 2004 తర్వాత పెన్షన్ గ్యారెంటీ లేకుండా పోయింది. దేశాన్ని దోచుకున్న బ్రిటీష్ వారి పాలనలో కూడా ఉద్యోగులకు పెన్షన్ ఉండేది. ఎన్నో పోరాటాల అనంతరం డి ఫైస్ట్ పెన్షన్' పథకం అమల్లోకి వచ్చింది. అయితే ప్రభుత్వాలు సక్రమం గా అమలు చేయలేదు. దీంతో సుప్రీం కోర్టు 1982లో 'డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా' కేసులో "పెన్సస్, యాజ మాన్యం దయతో ఇచ్చేది కాదు. ఉద్యోగుల హక్కు' అని తీర్పు ఇచ్చింది. ఆ తర్వాతే అన్ని ప్రభుత్వాలు పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్, పిఎఫ్ అమలు చేశాయి. ఉద్యమాల ద్వారా సాధించుకున్న పెన్షన్ హక్కును సుప్రీంకోర్టు ధృవీకరిం చిన తర్వాత కూడా మన పాలకులు 2004 తర్వాత రద్దు చేశారు. దేశ వ్యాప్తంగా సుమారు 59 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్లో 186 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్ కోల్పోయారు. వారి కుటుంబాలకు కనీస సామాజిక భద్రత లేకుండా పోయింది.
అందుకే అనేక రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ రద్దు వ్యతిరేక ఉద్యమాలు తీవ్రంగా సాగుతున్నాయి. అనేక సంఘాలు విడివిడిగా, ఐక్య వేదికలుగా ఏర్పడి ఈ ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేలాదిగా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు.
అయినా ప్రభుత్వాలు స్పందించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి నెపం వేసుకుంటూ దోబూచులాడు కుంటున్నాయి. తమ బాధ్యత నుండి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
2003 లోనే ఎస్డీఏ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. 2004 తర్వాత యుపిఏ ప్రభుత్వం పిఎఫ్ఆర్డీఏ ద్వారా నూతన పెన్సన్ పథకం అమలుకు బిల్లు తెచ్చింది. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందక ముందే బెంగాల్, కేరళ, త్రిపుర తప్ప దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేశాయి.
కేంద్రంలో చట్టం తెస్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవచ్చు? చేయక పోవచ్చు? అనే ఆపన్ ఉన్నప్పటికీ సిపిఎసను 1.9.2004 నుండి మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. పాలకులు, ఉద్యోగుల ప్రయోజనాల కంటే కార్పొరేట్ల ప్రయోజ నాలు ముఖ్య మైనవిగా భావించారు. సంస్కరణలు అమలు చేయడమే తమ విధానాలుగా పాలన చేస్తున్నారు. ఉద్యోగులు పెన్షన్ హక్కు కావాలని ఉద్యమిస్తే తమ బాధ్యత లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. పాలకుల ప్రయోజనాలు కాపాడే కొందరు, ఒక లక్ష్యం లేకుండా, స్పష్టత లేకుండా ఉద్యమాలను నడుపు తున్నారు.. | వామపక్షాలు పార్లమెంటులో అడ్డు కోవడం, పార్లమెంట్ వెలుపల ప్రజా సంఘాలు ఉద్యమాలు నడపడంతో 2013 వరకు బిల్లు ఆగింది. కానీ అదే సంవత్సరం సెప్టెంబరులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి సహకారంతో పిఎఫ్ఆర్డిఎ చట్టం తెచ్చారు.
సిపిఎస్ ప్రమాదాన్నీ గుర్తించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రమైన ఆవేదనతో అన్ని రకాల ఉద్యమాల్లో పాల్గొంటు న్నారు. వారి లక్ష్యం ఒక్కటే సిపిఎస్ రద్దు.
రాష్ట్రం లోని ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. అందుకే ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ రద్దు చేస్తూ, అసెంబ్లీలో తీర్మానం చేయాలనే డిమాండ్ తో ఫ్యాప్టో ఉద్యమిస్తోంది.
జులై 30 నుండి ఆగస్టు 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుండి విజయవాడ వరకు, అనంతపురం, చిత్తూరు నుండి విజయవాడ వరకు మూడు జాతాలు చేపట్టింది. అన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయులను, ఉద్యోగు లను చైతన్యపరుస్తూ సాగే జాతాలు ఆగస్టు 11వ తేదీన విజయవాడలో ‘భారీ ర్యాలీ-బహిరంగ సభతో ముగుస్తాయి. | రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానించాలి. ఉద్యోగులు, ప్రభుత్వం చెల్లించే 10+10 వాటాలు ఎస్ ఎస్ డిఎల్ కు డిపాజిట్ చేయడం నిలిపివేయాలి. 653, 654, 655 ఉత్తర్వులు రద్దు చేయాలి. పిఎఫ్ఆర్డితో ఒప్పందం రద్దు చేసు కోవాలి.
సిపిఎస్ పై ప్రభుత్వం తన విధానం ప్రకటించాలి. లేని పరిస్థితులలో సెప్టెంబర్ 1వ తేదీన జిల్లా కలెక్టరేట్ల పీకెటింగ్ చేపడుతున్నట్లు ఫ్యాప్టో ప్రకటించింది. 'క్విట్ సిపిఎస్' ఉద్యమంతో సిపిఎస్ రద్దు చేస్తారా! లేకుంటే తొలగిపోతారా! అనేది నిర్ణయించుకోవల్సింది పాలక వర్గాలే.
(రచయిత ఫ్యాప్టో చైర్మన్)