Type Here to Get Search Results !

281 జూనియర్‌ లెక్చరర్ల పోస్టులు - నోటిఫికేషన్‌ జారీ

281 జూనియర్‌ లెక్చరర్ల పోస్టులు - నోటిఫికేషన్‌ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం


వివిధ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 281 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 9 నుంచి సెప్టెంబర్‌ 8వ తే దీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బోర్డు కన్వీనర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ట్రైబల్‌ రెసిడెన్షియల్‌ సొసైటీలోని జూనియర్‌ కాలేజీల్లో 40, విద్యాశాఖ పరిధిలోని తెలంగాణ గురుకులాల్లో 3, సోషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కాలేజీల్లో 149, మైనారిటీ జూనియర్‌ కాలేజీల్లో 89 జేఎల్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఆబ్జెక్టివ్‌ విధానంలోని రాత పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో జనరల్‌ స్టడీస్‌, ఎబిలిటీ అండ్‌ ప్రొఫీసియెన్సీ ఇన్‌ ఇంగ్లీషుకు 100 మార్కులు, పేపర్‌-2లో పెడగాగి సబ్జెక్టుకు 100 మార్కులు, పేపర్‌-3లో సంబంఽధిత సబ్జెక్టుకు 100 మార్కులు ఉంటాయి. డెమాన్‌స్ట్రేషన్‌కు 25 మార్కులు కేటాయించారు. మొత్తం 325 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది
Tags