Type Here to Get Search Results !

2/8/18 నేటి నిధ్యా విషయక వార్తా సమాహారం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం యధాతధం

న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై దళితుల ఆగ్రహవేశాలకు మోడీ సర్కార్‌ దిగొచ్చింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ఇప్పటికే దళిత సంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునివ్వగా, కేంద్రంలోని ఎన్‌డీఏలోని భాగస్వామ్య పార్టీలు, చివరకు కేంద్ర మంత్రులుసైతం మోడీకి అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని యధావిధిగానే ఉంచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు బిల్లు తెచ్చేందుకు కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం గతంలో ఎలా ఉందో అలానే కొనసాగించేందుకు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దళితులపై దాడి చేశారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే అందుకు కారణమైన వారిని ఎలాంటి విచారణ చేయకుండా అరెస్టు చేయడం సరికాదని తన తీర్పులో స్పష్టం చేసింది. తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా దళిత సంఘాలు భగ్గుమన్నాయి.
ఇప్పుడున్న చట్టాన్ని నీరుగారిస్తే భవిష్యత్తులో దళితులపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని దళిత సంఘాలు, విపక్షాలతోపాటు స్వపక్ష పార్టీలుసైతం హెచ్చరించాయి. దళితులపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌పై ఉన్న ఆంక్షలను కూడా సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్‌ ఆదర్శ్‌ గోయల్‌, జస్టిస్‌ లలిత్‌ ఎత్తివేశారు. ప్రభుత్వ ఉద్యోగిని విచారణ చేయాలంటే పై అధికారుల అనుమతి తీసుకోవాల్సిందేనని సుప్రీం కోర్టు రూలింగ్‌ ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై పలువురు దళిత కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధుల ఒత్తిడి తెచ్చారు. బీజేపీ మిత్రపక్షం లోక్‌ జనశక్తి అధినేత, కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం యధావిధిగా ఉండేలా పార్లమెంటులో కొత్త బిల్లును తీసుకురావాలని కోరారు.
ఆయన అభ్యర్థనకు అధికార పార్టీలోని పలువురు దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. మరోవైపు ఈ నెల తొమ్మిదిన దళిత సంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునివ్వటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఏప్రిల్‌ 2న జరిగిన భారత్‌ బంద్‌లో పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో 12 మంది ఆందోళనకారులు మతి చెందారు. దీంతో కేంద్రం వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బిల్లు యథావిధంగా కొనసాగేందుకు మరో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు అడుగులు వేస్తోంది

ఇక విద్యార్థులతో సిఎం ముఖాముఖి

- జిల్లాకు రూ.కోటితో కార్యక్రమం జీవో 169 జారీ
విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కూడా ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. గ్లోబల్‌ కాంపిటిటివ్‌నెస్‌ ఫర్‌ కెపాసిటీ బిల్డింగ్‌ పేరుతో నిర్వహించే ఈ కార్యక్ర మంలో ఒక్కో రోజు ఒక్కో యూనివర్శిటీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించను న్నారు. రూ. 1 కోటితో ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్‌ దాస్‌ బుధవారం జీవో 169 విడుదల చేశారు. ఈ ఖర్చును ఉన్నత విద్యా మండలి 60 శాతం, యూనివర్శిటీలు 40 శాతం వంతున భర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏ యూనివర్శిటీలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో దాని పరిధిలోని కళాశాలల నుంచి 5వేల మందికి తగ్గకుండా మొత్తం 12వేల మంది ఒక్కో ముఖాముఖికి హాజరయ్యేట్టు చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయాల విసిలతో పాటు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ.. ఈ ఏడాది వద్దు!

  • సర్కారుకు ఉన్నత విద్యామండలి లేఖ
 నాలుగేళ్ల సమీకృత బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ ప్రోగ్రామ్‌ను ప్రవేశ పెట్టేందుకు వీలుగా పార్లమెంట్‌లో త్వరలోనే బిల్లు పెట్టనున్నందున రాష్ట్రంలో 2018-19 విద్యాసంవత్సరంలో ఈ కోర్సును అమలు చేయొద్దని ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి సూచించింది. సదరు బిల్లుకు చట్టబద్ధత రాగానే యూజీసీ, ఎన్‌సీటీఈ అన్ని రాష్ట్రాలకు సమాచారం పంపుతాయని తెలిపింది. దీనికోసం నియమించిన జాతీయ సంప్రదింపుల కమిటీలు ఇచ్చిన నివేదికను కేంద్ర మానవవనరుల శాఖ పరిశీలిస్తోందని పేర్కొం ది. 2019-20 విద్యాసంవత్సరం నుంచి నాలుగేళ్ల బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సును ప్రారంభించేందుకు ఎన్‌సీటీఈ సన్నద్ధమవుతోందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి సదరు కోర్సును నిలిపేయాలని లేఖ రాసింది.
విద్యా ప్రమాణాలను కాపాడేందుకు.. గతనెల 9న ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన జీ.వో.140ని కూడా నిలిపివేయాలని సూచించింది. విధివిధానాలు రాష్ట్రానికి వచ్చే వరకు కాలేజీలకు అనుమతులు, వర్సిటీలు అఫిలియేషన్లు ఇ వ్వొద్దని స్పష్టం చేసింది. రాష్ట్రంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏబీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులను నిర్వహించుకునేందుకు ఆరు ప్రైవేట్‌ బీఈడీ కాలేజీలకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటి వరకు రీజినల్‌ బీఈడీ కాలేజీల్లోనే ఈ కోర్సు నడుస్తోంది. అయితే రాష్ట్రంలోనూ ఈ కోర్సును నిర్వహించుకునేందుకు 33 కాలేజీలకు ఎన్‌సీటీఈ 2015-16 విద్యా సంవత్సరంలోనే అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ఈ కోర్సుకు సంబంధించిన సిలబస్‌ రూపకల్పనకు ఉన్నత విద్యా మండలి ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ ముసాయిదా సిలబ్‌సను రూపిందించినా ఇంకా అనుమతి రాలేదు. ఫలితంగా ఈ కోర్సు పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
కోర్సు నిర్వహణపై గతంలో పాఠశాల, ఉన్నత విద్యాశాఖల అధికారులు సమావేశం నిర్వహించారు. అటానమస్‌ ఉన్న డిగ్రీ కాలేజీలకు, నాక్‌ అక్రిడిటేషన్‌ కలిగిన డిగ్రీ కాలేజీలకు మాత్రమే ఈ కోర్సుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మూడేళ్ల డిగ్రీ కోర్సును సీబీసీఎస్‌ విధానంలో నిర్వహిస్తుండటం, డిగ్రీ కాలేజీల్లో మాత్రమే మౌలిక సదుపాయాలు, ల్యాబ్‌లు ఉన్నందున ఈ అభిప్రాయానికి వచ్చారు.
ఐదు సంవత్సరాలు చదవాల్సిన డిగ్రీ, బీఈడీ చదువును నాలుగేళ్లకు కుదించాల్సి రావడంతో సిలబస్‌ విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఎలాంటి అధ్యయనం లేకుండా, మౌలిక సదుపాయాలు సరిచూసుకోకుండా ఏకంగా ప్రైవేట్‌ బీఈడీ కాలేజీలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. సిలబస్‌ లేకుండా.. బీఎడ్‌ కాలేజీల్లో ల్యాబులు, మౌలిక సదుపాయాలు లేకుండా వర్సిటీలు ఆయా కాలేజీలకు అఫిలియేషన్‌ ఎలా ఇస్తాయన్న దానిపై స్పష్టత లేదు. 2018-19 విద్యా సంవత్సరంలో ఆయా కోర్సులను ఎలా నిర్వహిస్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి ఈ కోర్సును నిర్వహించరాదని సూచించింది.

450 కళాశాలల్లో ‘భోజనం’

విశాఖలో ప్రారంభించిన మంత్రి గంటా
ఇంటర్‌ విద్యలో డ్రాపౌట్స్‌ తగ్గించే లక్ష్యంతో 450 జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలోని ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలలో బుధవారం ఆయన మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మొత్తం 450 జూనియర్‌ కళాశాలల్లో 1,74,683 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం కింద భోజనం అందించనున్నామని తెలిపారు.

పోస్టులు, భృతికి నేడు ఆమోదముద్ర

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయుల భర్తీకి ఆమోదముద్ర వేయనున్నారు. సుమారు 20వేల పోస్టుల వరకూ భర్తీ చేసేందుకు పచ్చజెండా ఊపనున్నారు.

ఎన్నికల నాటికి 3 లక్షల ఉద్యోగాలు

ఎన్నికల నాటికి ఐటీలో లక్ష మందికి, ఎలక్ట్రానిక్స్‌లో 2లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి తీరుతామని మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. తిరుపతిలో రిలయన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ సెజ్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ డీపీఆర్‌ సమర్పించిందన్నారు. 125ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయిస్తామన్నారు. రిలయన్స్‌ తయారుచేసే జియో ఫోన్లు, టీవీలు, సెట్‌టాప్‌ బాక్సుల్లో 80ు ఇక్కడే తయారవుతాయన్నారు. ఆనాడు రాళ్లు, రప్పల మధ్యలో చంద్రబాబు సైబరాబాద్‌ను నిర్మించారన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నవాళ్లకు అక్కడే ఉద్యోగాలు కల్పించాలని సీఎం దిశానిర్దేశం చేశారని తెలిపారు. కాగా, వివిధ కంపెనీలు, సంస్థలతో చేసుకున్న ఒప్పందాల అమలులో గుజరాత్‌ (216) నంబర్‌వన్‌గా ఉంటే, 214 ఒప్పందాలను అమలు చేసి ఏపీ రెండోస్థానంలో ఉందన్నారు.
Tags