నేటి నుంచి కాలేజీల్లో ‘భోజనం’
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బుధవారం నుంచి మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి రానుంది. 450 కాలేజీల్లో ఇంటర్మీడియెట్ చదువుతున్న 1,74,683 మందికి భోజనం అందిస్తారు. మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విశాఖలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.