ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.
పరీక్షా విధానం, సిలబస్లో మార్పులేమి లేవు.
ఇదివరకు ఉన్న విధంగానే పరీక్ష నిర్వహణ జరగనుంది. పరీక్ష ఫీజులో సైతం మార్పులేమి లేవు. క్రితంసారి ఉన్న విధంగానే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పోటీ పరీక్షలను ఈ విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు పర్యాయాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
జేఈఈ(మెయిన్), నీట్(యూజీ)లను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించనున్నారు.
ఈ సదవకాశం విద్యార్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉండనుంది. పరీక్షల నిర్వహణ అంతా ఆన్లైన్లోనే జరగనుంది.పరీక్షా, షెడ్యూల్ విధానం ఈ విధంగా ఉంది.
1. యూజీసీ-నెట్.. డిసెంబర్లో నిర్వహణ. -
01 సెప్టెంబర్,2018 నుంచి 30 సెప్టెంబర్, 2018 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
- 02 డిసెంబర్, 2018 నుంచి 16 డిసెంబర్, 2018 మధ్యకాలంలో రెండు షిప్టుల్లో శని, ఆదివారాల్లో పరీక్ష నిర్వహణ.
- 2019 జనవరి చివరివారంలో ఫలితాల వెల్లడి.
2.జేఈఈ(మెయిన్).
జనవరిలో 2019, ఏప్రిల్ 2019లో పరీక్ష నిర్వహణ.ఏ) జనవరిలో నిర్వహించే పరీక్ష షెడ్యూల్.. - 09 సెప్టెంబర్,2018 నుంచి 30 సెప్టెంబర్,2018 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణ - 06 జనవరి,2019 నుంచి 20 జనవరి,2019 మధ్యకాలంలో ఎనిమిది విడతల్లో నిర్వహించే పరీక్షకు అభ్యర్థులు ఏ తేదీనైనా ఎంపిక చేసుకోవచ్చు
- 2019 ఫిబ్రవరి మొదటివారంలో ఫలితాల వెల్లడి
బి) ఏప్రిల్లో నిర్వహించే పరీక్ష షెడ్యూల్..
- 2019 ఫిబ్రవరి రెండోవారంలో దరఖాస్తుల సమర్పణ
- 07 ఏప్రిల్,2019 నుంచి 21 ఏప్రిల్,2019 మధ్యకాలంలో ఎనిమిది విడతల్లో నిర్వహించే పరీక్షకు అభ్యర్థులు ఏ తేదీనైనా ఎంపిక చేసుకుని పరీక్షకు హాజరుకావచ్చు
- 2019 మే నెల మొదటివారంలో ఫలితాల వెల్లడి.
3. నీట్(యూజీ).. ఫిబ్రవరి 2019, మే 2019 పరీక్ష నిర్వహణ
ఎ). ఫిబ్రవరి 2019 పరీక్ష- 01 అక్టోబర్,2018 నుంచి 31 అక్టోబర్,2018 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ
- 03 ఫిబ్రవరి,2019 నుంచి 17 ఫిబ్రవరి,2019 మధ్యకాలంలో పరీక్ష నిర్వహణ
- 2019 మార్చి మొదటివారంలో ఫలితాల వెల్లడి
బి). మే 2019 పరీక్ష
- మార్చి 2019 రెండోవారంలో ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ
- 12 మే, 2019 నుంచి 26 మే, 2019 మధ్యకాలంలో పరీక్ష నిర్వహణ
- 2019 జూన్ మొదటివారంలో ఫలితాల వెల్లడి
4. జనవరి 2019లో సీమ్యాట్, జీప్యాట్ పరీక్ష నిర్వహణ.
. - 22 అక్టోబర్,2018 నుంచి 15 డిసెంబర్,2018 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణ- 27 జనవరి,2019న పరీక్ష నిర్వహణ
- 2019 ఫిబ్రవరి మొదటివారంలో ఫలితాల వెల్లడి