ఎఫ్ డి వడ్డీ రేట్లు పెంచిన ఎస్ బి ఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ ఫిక్సెడ్ డిపోజిట్ ప పై వడ్డీ రేట్లను పెంచిందిOdisha: సీఎం సంచలన నిర్ణయం...57,000 మంది కాంట్రాక్టు వర్కర్ల రెగ్యులరైజేషన్
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారంనాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్ట్ రిక్రూట్‌మెంట్ వ్యవస్థ (contractual recruitment system)ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం విడుదల చేస్తామని చెప్పారు.
నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలి
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్
ముగిసిన యూడైస్ ప్లస్ వర్క్షాప్
నూతన ఆవిష్కరణలతో విద్యా భివృద్ధికి నాంది పలకాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ సూచించారు. విజయవాడలో రెండు రోజు లపాటు జరిగిన యూడైస్ ప్లస్ ప్రాంతీయ కార్యశాలకు ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబర్ దీవులు, పుదుచ్చేరికి చెందిన అధికారులు హాజర య్యారు. ఈ కార్యశాల ముగింపు సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి అన్ని రాష్ట్రాలు బాగా కృషి చేస్తున్నాయని, ఆయా రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలు, కొత్త ఆలోచనలను పంచుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో కేంద్ర విద్యాశాఖ గణాంక ప్రచురణల విభాగం డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ హెగ్దే, గ్రంథాలయ శాఖ డైరెక్టర్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.
జిల్లాలోని అన్ని యాజమాన్య ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుచు విద్యాశాఖ ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా తొలుత ప్రతిఒక్క విద్యార్థి విధిగా తల్లిదండ్రుల నుంచి స్మార్ట్ ఫోన్లను పాఠశాలలకు తీసుకురావలసి ఉంటుంది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది భారంగా మారనుంది. ప్రస్తుతం ప్రతి ఇంటిలో స్మార్ట్‌ఫోన్ ఉంటున్నా.. ఇప్పటికీ సాధారణ మొబైల్స్ వాడేవారు కూడా ఉన్నారు. ఇటువంటి వారు తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఎలా కొంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం నాణ్యమైన ఫోన్ కొనాలంటే రూ.12 వేల వరకూ వెచ్చించాలి. ఇప్పటికప్పుడు ఇంతమొత్తం ఎక్కడ నుంచి తేవాలని తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి.

'ఉత్తమ అవార్డులకు' విద్యార్థుల ఎంపిక
ఉన్నత విద్యామండలి ప్రకటించిన 'ఉత్తమ విద్యార్థి అవార్డు', 'కమ్యూనిటీ సర్వీస్ అవార్డు'కు విద్యార్థులను జ్యూరీ శనివారం ఎంపిక చేసింది. ఉత్తమ విద్యార్థి అవార్డుకు 105 దరఖాస్తులు రాగా.. వీరిలో 16మందిని తుది పోటీకి ఎంపిక చేశారు. వీరిలోనుంచి నలుగురిని జ్యూరీ ఖరారుచేసింది. కమ్యూనిటీ సర్వీస్ అవార్డుకు మరో నలుగుర్ని ఎంపిక చేసింది. ఈ ఫలితాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.I7 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 'టీచ్ ఎట్ రైట్ లెవెల్ (టీఆర్ఎల్) శిక్షణ ఈనెల 17 నుంచి 31 వరకూ జరగనుంది. మండల స్థాయిలో ఒక్కొక్క బృందానికి 4 రోజుల చొప్పున మూడు అంచెల్లో ఇది ఏర్పాటుకానుంది. తెలుగు, లెక్కల సబ్జెక్టుల్లో శిక్షణ ఇస్తారు. అనంతరం ఉపాధ్యాయులు 3, 4, 5 తరగతుల విద్యార్థులకు బేస్లైన్ పరీక్ష నిర్వహించాలి. ఆ తరువాత రెండు గ్రూపుల పిల్లలకు ఉదయం, సాయంత్రం గంట చొప్పున తెలుగు, గణితం సబ్జెక్టుల్లో నిర్దేశించిన అంశాలను బోధించాల్సి ఉంటుందని ఎస్ఎస్ ఎఎంవో సుధాకర్ తెలిపారు.ఫోన్ ఇస్తే చదువుతారా?
- 4 నుంచి 10 తరగతులకు బైజూస్ పాఠాలు
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చేతికి స్మార్ట్ఫోన్లపై తల్లిదండ్రుల్లో ఆందోళన
- కరోనా సమయంలోనే విజయవంతం కాని వైనం
- సర్కారు తాజా నిర్ణయంపై విమర్శల వెల్లువ
జిల్లాలోని అన్ని యాజమాన్య ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుచు విద్యాశాఖ ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా తొలుత ప్రతిఒక్క విద్యార్థి విధిగా తల్లిదండ్రుల నుంచి స్మార్ట్ ఫోన్లను పాఠశాలలకు తీసుకురావలసి ఉంటుంది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది భారంగా మారనుంది. ప్రస్తుతం ప్రతి ఇంటిలో స్మార్ట్‌ఫోన్ ఉంటున్నా.. ఇప్పటికీ సాధారణ మొబైల్స్ వాడేవారు కూడా ఉన్నారు. ఇటువంటి వారు తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఎలా కొంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం నాణ్యమైన ఫోన్ కొనాలంటే రూ.12 వేల వరకూ వెచ్చించాలి. ఇప్పటికప్పుడు ఇంతమొత్తం ఎక్కడ నుంచి తేవాలని తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి.
జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు 1722 ఉన్నాయి. నాలుగు నుంచి టెన్త్ వరకూ చదువుతున్న విద్యార్థులు దాదాపు 84,987 మంది ఉన్నారు. కాగా మొదట పాఠశాలల హెచ్‌ఎంలు తరగతుల వారీగా విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ ఉన్నది లేనిది విషయాలు తెలుసుకొవాల్సి ఉంది. ఆ వివరాలను యూడైస్ లాగిన్‌లో స్మార్ట్ ఫోన్ నెంబర్‌తో సహా డేటాను క్యాప్చరింగ్ చేసి ఎంటర్ చేయాలి. ఇప్పటికే ప్రతి పాఠశాలలో విద్యార్థి నుంచి వివరాలు సేకరించడాన్ని ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఈ నెల 20 తేదీతో ముగించాల్సి ఉంది. తొలుత 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల ఫోన్ నెంబర్లు స్వీకరించనున్నారు. ఆ స్మార్ట్ ఫోన్లను పాఠశాలలకు తీసుకొస్తే విద్యార్థులు చదువుతున్న పాఠ్యాంశాల కంటెంట్‌ను ఉపాధ్యాయులు అప్‌లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియలో జిల్లాలోని 15 మండలాలు, పురపాలక సంఘాల పరిధిలో గల క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు (సీఆర్‌పీలు) హెచ్‌ఎంలకు పూర్తిస్థాయిలో సహకారాన్ని అందించాలి. యాప్‌ను ఇన్‌స్టాలేషన్ చేయడానికి తరగతుల వారీగా ఈ నెల 21 నుంచి రోజుకు ఒక్క తరగతి చొప్పును ఈ నెల 28 వరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. కాగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వహామీ ఇప్పటికీ అమలు కాలేదు. ఇదిలా ఉండగా కరోనా సమయంలో కొన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్ బోధన అమలు చేసినా.. విజయవంతం కాలేదు. మరోవైపు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టిన తర్వాత కూడా సర్కారీ పాఠశాలల్లో ఫలితాలు అంతంతమాత్రమే. పాఠశాలల విలీనం తర్వాత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇటువంటి పరిస్థితుల్లో బైజూస్ పేరిట విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆదేశాలు రాలేదు
ప్రభుత్వ బడుల్లో కొత్త చిక్కు..
ఆదేశాలు రాలేదు
బైజూ్‌స పాఠాలు చెప్పేందుకు గాను పాఠశాలలకు విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు తెచ్చుకోవాలనే దానిపై విద్యాశాఖ కమిషనర్ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన తరువాత తెలియజేస్తాం.
ఎన్వీ రమణ, జిల్లా విద్యాశాఖ అధికారి, పార్వతీపురం
మెడికల్ ప్రవేశాల్లో స్కౌట్స్ విద్యార్థులకు అవకాశం
రాష్ట్రంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ధ్రువపత్రా లున్న విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీ నర్ కోటా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పత్రాలను ఈ నెల 20వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయా లని సూచించారు.
ఎన్వీ రమణ, జిల్లా విద్యాశాఖ అధికారి, పార్వతీపురం
నీట్ పీజీ డెంటల్ ప్రవేశాలకు కటాఫ్ తగ్గింపు
జా తీయ వైద్యమండలి తాజాగా నీట్ పీజీ డెంటల్-2022 ప్రవేశాలకు కటాఫ్ మార్కులను తగ్గించింది. ఈ నేప థ్యంలో రాష్ట్రంలోని దంతవైద్య కళాశాలల్లో ఉన్న పీజీ ఎండీఎస్ సర్వీస్, నాన్-సర్వీస్ సీట్ల ప్రవేశానికి ఈనెల 16 నుంచి 18వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసు కోవాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజి స్ట్రార్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. జనరల్ కేటగిరీ (అన్ రిజర్వుడు) విభాగంలో గతంలో ఉన్న 263 కటాఫ్ మార్కుల నుంచి 174కు, ఎస్సీ/ఎస్టీ, బీసీ కేటగిరీలో 227 నుంచి 138, అన్రిజర్వుడు- పిడబ్ల్యుడి విభాగంలో 245 నుంచి 157 మార్కులకు కుదించారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.మెడికల్ ప్రవేశాల్లో స్కౌట్స్ విద్యార్థులకు అవకాశం
రాష్ట్రంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ధ్రువపత్రా లున్న విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీ నర్ కోటా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పత్రాలను ఈ నెల 20వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయా లని సూచించారు.
ముగిసిన ఒంగోలు ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్
ఇడుపులపాయలో నిర్వహించేఒంగోలు ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం ముగిసింది. రెండో రోజు కౌన్సెలింగ్కు 566 మందికి గాను 496 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆర్కే వ్యాలీ క్యాంపస్ లోని సెంట్రల్ లైబ్రరీలో జరిగిన అడ్మిషన్ల ప్రక్రియను ఒంగోలు, ఆర్కే వ్యాలీ డైరెక్టర్లు కసిరెడ్డి సంధ్యారాణి, జయరామిరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1,082 మందిని కౌన్సెలింగ్కు పిలవగా 935 మంది అడ్మిషన్లు పొందారన్నారు. మిగిలిన సీట్లు రెండో విడతలో మెరిట్ విద్యార్థులతో భర్తీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఓఎన్డీ గంగిరెడ్డి, ఏవో మహబూబ్ జిల్లా అకడమిక్ డీన్ రత్నకుమారి, అసోసియేట్ డీన్స్ రోజర్ బిన్ని, భానుమూర్తి, చంద్రారెడ్డి పాల్గొన్నారుసీబీఏలో ఆబ్జెక్టివ్, రాత ప్రశ్నలు
- తరగతుల వారీగా ప్రశ్నావళి
- ఓఎంఆర్‌పై టీచర్లకు వెబినార్లు
- ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ప్రతా్‌పరెడ్డి వెల్లడి
కాకిలెక్కల బడి!
- బడి మానేసిన విద్యార్థుల సంఖ్య తగ్గించేందుకు అధికారుల ఒత్తిడి
- తప్పనిసరై తప్పుడు వివరాల నమోదు.
- రాష్ట్రంలో 1.73 లక్షల మంది బడి బయటే
ప్రభుత్వ బడుల్లో కొత్త చిక్కు..
ప్రభుత్వ బడుల్లో మానేసిన పిల్లల విష యంలో ప్రధానోపాధ్యాయులకు కొత్త చిక్కు వచ్చిపడింది. వారు మళ్లీ బడి చేరినట్లు రికా ర్డుల్లో రాయడం.. లేదంటే టీసీలు ఇచ్చినట్లు పేర్కొంటూ డ్రాప్ బాక్సుల నుంచి తొలగిం చాలి. టీసీలు ఇచ్చినట్లు రాస్తే మండల విద్యాధికారుల నుంచి ఒత్తిడి. దీంతో పిల్లలు వెనక్కి వచ్చినట్లు రాసుకొని, రికార్డులు కొన సాగిస్తున్నారు. బడి బయటి పిల్లల్ని గుర్తించే బాధ్యతను వాలంటీర్లు, విద్య, సంక్షేమ సహా యకులకు అప్పగించి, వారిపై తీవ్ర ఒత్తిడి చేస్తుండడంతో కొన్నిచోట్ల పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు నమోదు చేసేస్తు న్నారు. మరి కొన్నిచోట్ల సార్వత్రి విద్యా పీరంలో చదువుకునేందుకు రిజిస్టర్ అయ్యా రని ఆన్లైన్లో ఎక్కిస్తున్నారు. కడప జిల్లాలో విద్యార్ధి బడి మానేశాడు. అనా రోగ్యం కారణంగా మానేసినట్లు తండ్రి చెప్పగా.. సార్వత్రిక విద్యా పీఠంలో చేరినట్లు చెప్పాలని విద్యార్థి తండ్రికి సూచించి, ఇదే వివరాలను ఆన్లైన్ నమోదు చేశారు. కలె క్టర్లు రోజువారీ సమీక్షలతో ఒత్తిడి పెట్టడంతో ఏదో ఒక కారణం రాసేస్తున్నారు.
తప్పు పై తప్పు..
రాష్ట్రవ్యాప్తంగా 1-5 తరగతులు చదివేవారిలో 68,205 మంది బడి మానేయగా.. ఉన్నత పాఠశాలల్లో 1,07211 మంది పాఠశాలకు దూర మయ్యారు. తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలకు పనులకు వెళ్లడంతో 18,857 మంది వారితో వెళ్లిపోయారు. సీజనల్ వలసల కారణంగా 38,951 మంది బడి మానేశారు. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో 1,289 పిల్లలు చనిపోయారు.

హాజరు శాతం అందుకే తగ్గిందా?
బడి మానేసిన వారు తిరిగి బడిలో చేరినట్లు. లెక్కలు చూపితే కొన్ని రోజులపాటు హాజరు నమోదు చేసినా ఆ తర్వాత హాజరు శాతం తగ్గిపోతుంది. పాఠశాల విద్యాశాఖ ఆగస్టులో వెబ్సైట్లో ఉంచిన సమాచారం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు 15%-19%, ప్రైవేటులో 8%-10% మంది గైర్హాజరవుతు న్నారు. ఇంత పెద్ద మొత్తంలో బడికి రావడం లేదంటే రికార్డుల్లోని అంకెల్లోనే తప్పులు ఉన్న ని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
ఏం చేయాలి?
పాఠశాలలకు వెళ్లే పిల్లలు మధ్యలో చదువు మానేస్తే ఏం చేయాలి? వారు వేరే పాఠశాలల్లో చేరారా? బడి మానేసి ఇంటి వద్ద ఉన్నారా? ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయారా? అనేది పరిశీలించాలి. వారిని మళ్లీ బడికి రప్పించేందుకు _చర్యలు తీసుకోవాలి.
ఏం చేస్తున్నారు?
అధికారులు మాత్రం బడి మానేసిన పిల్లలు మళ్లీ చేరి నట్లు రికార్డుల్లో రాసుకోవాలంటూ పాఠశాలలపై ఒత్తిడి చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలో పిల్లవాడు బడి నుంచి వెళ్లిపోతే కారణం పేర్కొంటూ డ్రాప్ బాక్సులో పెడతారు. ఇప్పుడు అధికారులు ఆ డ్రాప్ బాక్సులను క్లియర్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. పల్నాడు. జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాల నుంచి ముగ్గురు విద్యా ర్థులు తల్లిదండ్రులతో కలిసి తెలంగాణకు వలస వెళ్లారు. మరొకరు బడి మానేశారు. ఇప్పుడు ఈ పిల్లలు తిరిగి బడిలో చేరినట్లు రికార్డుల్లో రాసుకోవాలని మండల విద్యాధికారి ఆదేశించారు. దీంతో హాజరు పట్టికలో వీరి పేర్లు ఎక్కించారు. ఉన్నతాధికారుల ఆదేశా లతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఇదే దుస్థితి నెలకొంది.
లక్షన్నర మందిపై నిర్లక్ష్యంఏటా డిగ్రీ అడ్మిషన్లు ఆగస్టులోనే ముగుస్తాయి. ఈ ఏడాది కూడా అందుకు అనుగుణంగానే జూలై 22న నోటిఫికేషన్ ఇచ్చారు. ఆగస్టు 8 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి, అదే నెల 20న సీట్లు కేటాయిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది. నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 22 నుంచే తరగతులు ప్రారం భం కావాలి. కానీ అడ్మిషన్లను వాయిదాలపై వాయిదాలు వేశారు. కళాశాల విద్యాశాఖ చేయాల్సిన అఫిలియేషన్ల పనిలో ఉన్నత విద్యాశాఖ జోక్యం చేసుకోవడంతో మొదలైన ఈ తలనొప్పి, ఆన్‌లైన్ కారణంగా ఇప్పటికీ కొనసాగుతోంది. డిగ్రీలో కోర్సుల కోడ్‌లు మార్చేయడం... పాత, కొత్త కోర్సుల కోడ్‌లు కలిసిపోవడం... ఇంతచేసినా చివరికి కొన్ని కోర్సులు కనిపించకుండాపోవడం అడ్మిషన్ల ప్రక్రి య ఏస్థాయిలో విఫలమైందనే దానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఈలోగా ఉన్నత విద్యాశాఖ జోక్యం చేసుకుని కొన్ని కాలేజీలకు అడ్మిషన్లు నిలిపివేయడం, ఆ కాలేజీలు కోర్టుకు వెళ్లి అనుకూలంగా ఆదేశాలు పొందడం ఆలస్యానికి మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఉన్నత విద్యాశాఖ చేసిన ఈ గందరగోళానికి లక్షన్నర మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లకు దరఖాస్తులు భారీగా పడిపోయాయి. గత విద్యా సంవత్సరంలో 2.4 లక్షల మంది డిగ్రీలో చేరితే, ఈ ఏడాది 1.4లక్షలలోపు దరఖాస్తులే వచ్చాయి. దీనికితోడు సుదీర్ఘ కౌన్సెలింగ్ ప్రక్రియ మరింతమందిని డిగ్రీ విద్యకు దూరం చేస్తోంది. మరోవైపు తమపై కక్షగట్టి అడ్మిషన్లను నిలిపివేస్తున్నారని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.

డిగ్రీ ప్రవేశాలకు వాయిదాల పర్వం
- సీట్ల కేటాయింపు మళ్లీ నేటికి వాయిదా
- నెలలుగా కౌన్సెలింగ్ ప్రహసనం
- ఆందోళనలో లక్షన్నర మంది విద్యార్థులు
లక్షన్నర మందిపై నిర్లక్ష్యంఏటా డిగ్రీ అడ్మిషన్లు ఆగస్టులోనే ముగుస్తాయి. ఈ ఏడాది కూడా అందుకు అనుగుణంగానే జూలై 22న నోటిఫికేషన్ ఇచ్చారు. ఆగస్టు 8 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి, అదే నెల 20న సీట్లు కేటాయిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది. నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 22 నుంచే తరగతులు ప్రారం భం కావాలి. కానీ అడ్మిషన్లను వాయిదాలపై వాయిదాలు వేశారు. కళాశాల విద్యాశాఖ చేయాల్సిన అఫిలియేషన్ల పనిలో ఉన్నత విద్యాశాఖ జోక్యం చేసుకోవడంతో మొదలైన ఈ తలనొప్పి, ఆన్‌లైన్ కారణంగా ఇప్పటికీ కొనసాగుతోంది. డిగ్రీలో కోర్సుల కోడ్‌లు మార్చేయడం... పాత, కొత్త కోర్సుల కోడ్‌లు కలిసిపోవడం... ఇంతచేసినా చివరికి కొన్ని కోర్సులు కనిపించకుండాపోవడం అడ్మిషన్ల ప్రక్రి య ఏస్థాయిలో విఫలమైందనే దానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఈలోగా ఉన్నత విద్యాశాఖ జోక్యం చేసుకుని కొన్ని కాలేజీలకు అడ్మిషన్లు నిలిపివేయడం, ఆ కాలేజీలు కోర్టుకు వెళ్లి అనుకూలంగా ఆదేశాలు పొందడం ఆలస్యానికి మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఉన్నత విద్యాశాఖ చేసిన ఈ గందరగోళానికి లక్షన్నర మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లకు దరఖాస్తులు భారీగా పడిపోయాయి. గత విద్యా సంవత్సరంలో 2.4 లక్షల మంది డిగ్రీలో చేరితే, ఈ ఏడాది 1.4లక్షలలోపు దరఖాస్తులే వచ్చాయి. దీనికితోడు సుదీర్ఘ కౌన్సెలింగ్ ప్రక్రియ మరింతమందిని డిగ్రీ విద్యకు దూరం చేస్తోంది. మరోవైపు తమపై కక్షగట్టి అడ్మిషన్లను నిలిపివేస్తున్నారని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.
బర్త్ సర్టిఫికేట్ తో పాటుగా ఆధార్ - కేంద్రం కీలక నిర్ణయం
ఆధార్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుడే పుట్టిన పిల్లల జనన ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్ ఇవ్వాలని నిర్ణయించింది.అప్పుడే పుట్టిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
తెలంగాణ తో పాటు మరో 15 రాష్ట్రాల్లో ప్రస్తుతం.. ఈ విధానం అమలు చేస్తుండగా త్వరలోనే అన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణలో గతేడాది నుంచే జనన ధ్రువీకరణ పత్రాన్ని ఆధార్‌తో అనుసంధానం చేశారు.
తజాగా అన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) చర్యలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఐదేళ్లలోపు చిన్నారులకు.. ఆధార్ ఇచ్చినప్పటికీ వారి వేలిముద్రలు, ఐరిస్ నమోదు చేయకుండా పిల్లల ఫొటోను తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానిస్తున్నారు.
తర్వాత 5 నుంచి 15 ఏళ్ల మధ్య బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆధార్ ఆధారంగా.. కేంద్ర, రాష్ట్రాల్లోని దాదాపు వెయ్యి పథకాల్లో లబ్ధిదారులను నిర్ణయిస్తున్నారు.
ఇప్పటివరకూ 134 కోట్ల ఆధార్ కార్డులను జారీ చేసినట్లు ఉడాయ్ వెల్లడించింది.