Type Here to Get Search Results !

Telugu Educational News 10th Oct 2022

దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనం 

ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు 
ఈ నెల 31 వరకు దరఖాస్తులకు గడువు
అమరావతి : రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచి తంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది . ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావం తులు , సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ ( ఏపీడీఏఎసీసీఏసీ ) మార్గదర్శకాలను విడుదల చేసింది . ఆన్లైన్ ద్వారా ఈ నెల 31 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది . 70 శాతంపైగా వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులు . కనీసం పదో తరగతి పాసవ్వాలి . రూ . 3 లక్షలలోపు వార్షిక ఆదా యం ఉండాలి . లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి . వారికి సొంత వాహనం ఉండకూడదు . గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు . గతంలో దరఖాస్తు చేసినప్ప టికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులే . జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రం , ఆధార్ కార్డు , ఎస్ఎస్సీ ధ్రువపత్రం , ఎస్సీ , ఎస్టీ అయితే కుల ధ్రువీకరణపత్రం , దివ్యాం గుల పూర్తి ఫొటోను పాస్పోర్టు సైజులో ఉన్నది దరఖాస్తుతోపాటు https://apdascac.ap.gov.in/ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి .

ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు -ప్రభుత్వంపై బొప్పరాజు ధ్వజం

రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. నెల్లూరులో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పీఆర్సీ ప్రకటన సందర్భంగా నాటి మంత్రులు, అధికారుల కమిటీల చర్చల్లో ఒప్పు కొని రాతపూర్వకంగా రాసిచ్చిన అంశాలను సైతం ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ఆర్థి కేతర అంశాలను వెంటనే ప్రకటిస్తామనీ, ఆర్థికాంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 62 ఏళ్ల వయోపరిమితి పెంచిన ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లలో పని చేస్తున్న ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు వయోపరిమితి లేదంటూ జీవో ఇవ్వడం దారుణ మన్నారు. సీపీఎస్ రద్దు చేస్తా మని ఆశ కల్పించి ఇప్పుడు కుద రదని చెప్పడం దుర్మార్గమ న్నారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుండగా ఏపీలో చేయడం లేదన్నారు. డీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలకు నాటి చర్చల సంద ర్భంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నారన్నారు. అయితే అందుకు విరుద్ధంగా ఇప్పుడు జీవో వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం చేయాలనీ, లేకుంటే మరో విజయవాడ ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది..12 నుంచి కౌన్సెలింగ్

12 నుంచి కౌన్సెలింగ్
ఆర్టీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపుల పాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవే శాలకు సంబంధించి సాధారణ జాబితా అభ్యర్థులు ఎంపిక పూర్తయ్యింది. వారికి ఈ నెల 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇక్కడ పీయూసీ రెండు, ఇంజినీరింగ్ నాలుగు సంవత్స రాల చొప్పున మొత్తం ఆరు సంవత్సరాల సమీ కృత విద్యను అభ్యసించాల్సి ఉంటుంది.

ఈ నెల 12, 13 తేదీల్లో నూజివీడు, ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ) ప్రాంగణాల్లో, 14, 15 తేదీల్లో ఒంగోలు ప్రాంగణానికి సంబంధించి ఇడు పులపాయలో, 15, 16 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్ ఎచ్చెర్లలో జరుగుతుంది.

♦️రుసుములు ఇలా..
విద్యార్థులు ప్రభుత్వ పథ కాలు (విద్య, వసతి దీవెన) అర్హత లేని వారు పీయూసీలో సంవత్సరానికి రూ.45 వేలు, ఇంజినీ రింగ్లో సంవత్సరానికి రూ.50 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు నెలకు రూ.2,500 నుంచి రూ.3000. వరకు చెల్లించాలి. ప్రవేశ రుసుము రూ.1000, (ఎస్సీ, ఎస్టీలు రూ.500), గ్రూపు బీమా కింద రూ.1,200(ఈ సొమ్ము బీమా ఏజెన్సీకి చెల్లిస్తారు), కాషన్ డిపాజిట్ రూ.1000(ఇది ఆఖరులో అభ్యర్థికి తిరిగి చెల్లిస్తారు), వసతి గృహ నిర్వహణ రుసుము రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

♦️అవసరమైన పత్రాలు..: సంబంధిత బోర్డు జారీ చేసిన ఎస్ఎస్సీ/తత్సమాన పరీక్ష ధ్రువీక రణ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ, తాజా ఈడబ్ల్యూఎస్ (2021 తర్వాత), ప్రత్యేక విభాగాలకు చెందిన ధ్రువీకరణ పత్రాలు, పాస్పోర్ట్ ఫొటోలు.

♦️నూజివీడుకు రావాలంటే..

విశాఖపట్నం నుంచి రైలులో వచ్చే వారు. హనుమాన్ జంక్షన్ (నూజివీడు స్టేషన్)లో దిగి బస్సు లేదా ఆటోలో నూజివీడు చేరుకోవచ్చు. విజయవాడ నుంచి వచ్చే వారు విజయవాడలో దిగి, బస్సులో నూజివీడు చేరుకోవచ్చు.

ఐఐటీల్లోనూ ఆంగ్లం వద్దు

♦️పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు

హిందీ, ప్రాంతీయ భాషలకు సంబం ధించి కేంద్ర హోంమంత్రి అమిషా నేతృత్వం లోని అధికార భాషా పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. ఐఐటీల్లాంటి ఉన్నత సాంకేతిక, సాంకేతికేతర విద్యాసంస్థల్లోంచి బోధనామాధ్యమంగా ఇంగ్లీషును క్రమంగా తప్పించాలని సూచించింది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీలో, మిగతా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇంగ్లిషు కంటే స్థానిక భాష లకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ తన సిఫార్సుల్లో స్పష్టం చేసింది.

హిందీ మాధ్యమంలోనూ ఎంబీబీఎస్

ఈ ఏడాది నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అమలు

దేశంలో తొలిసారిగా ఈ విద్యాసంవ త్సరం (2022-23) ఎంబీబీఎస్ కోర్సును హిందీ మాధ్యమంలో అందించేం దుకు రంగం సిద్ధమైంది. గత ఏడాది నుంచి బీటెక్ ను ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతేడాది ఏపీలోని ఒక కళాశా లతోపాటు మొత్తం 14 కళాశాలల్లో ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ బోధిం చేందుకు ముందుకు వచ్చాయి. ఈ సారి ఆ సంఖ్య 20కి పెరిగింది. తాజాగా హిందీలో ఎంబీబీఎస్ ను అందించేందుకు రెండు రాష్ట్రాలు ముందుకువచ్చాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లోని గాంధీ మెడికల్ కళాశాల, ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని అటల్ బిహారీ వాజ్ పేయి విశ్వవిద్యాలయం దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఎంబీ బీఎస్ మొదటి సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే పాఠ్యపుస్తకాలను హిందీలోకి అనువాదం చేశారు. వాటిని ఈ నెల 16న భోపాల్ లో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించనున్నారు. ఈ రెండు వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవే. వాటిలో 15 శాతం సీట్లను జాతీయ కోటా కింద కేటాయించాలి. ఇలాంటి పరిస్థితుల్లో హిందీయేతర రాష్ట్రాలకు సీట్లు వస్తే ఇబ్బంది తప్పదని నిపుణులు పేర్కొం టున్నారు.

ఉద్యోగులకు తిప్పలే..తిప్పలు

  • పీఎఫ్‌ సొమ్ములకు దిక్కులేదు
  • సరెండర్‌ లీవ్స్‌కు దారిలేదు
  • రుణ దరఖాస్తుల దొంతర్లు
  • ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలు
  • ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి
  • సర్కార్‌ మొండి వైఖరిపై కస్సు బుస్సు
రోజువారి కష్టాలు వెన్నాడుతున్నాయి. కనీసం అవసరం నిమిత్తం పీఎఫ్‌ రుణం తీసుకుందామంటే ఏడాది గడిచినా దిక్కుమొక్కూ లేదు. పోని జీఎల్‌ఐసీ నుంచి రుణం పొందు దామా అంటే అక్కడా అదే పరిస్థితి. మరి ఇస్తామన్న డీఏలు ఇప్పటకీ చేతికందితే ఒట్టు. నెలలు దాటి సంవత్సరాలు గడుస్తుంటే పరిష్కారానికి బదులు జగన్‌ సర్కార్‌ మీన మేషాలు లెక్కిస్తోంది. దీనికితోడు రకరకాల సమస్యలతో ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే విలవిల్లాడుతున్నారు. పలానా సదుపాయం అదనంగా సాధించామని చెప్పుకోవడానికి ఏదీలేక ఉద్యోగులంతా పునరాలోచనలో పడుతున్నారు. సర్కార్‌ పట్ల అసంతృప్తి ఉన్నా.. క్రమ‘శిక్ష’ణకు లోబడి మౌనంగా ఉంటున్నారు. ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లపై పదేపదే గొంతెత్తుతున్నా సర్కార్‌లో మాత్రం ఉలుకు పలుకూ లేదు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్నాయని పైపైకి చెబుతున్నదానికి, వాస్తవ కోణంలో జరుగుతున్నదానికి పొంతనే లేదు.
అందరికీ తిప్పలే.. తిప్పలు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 33 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో అత్యధికులు ఉపాధ్యాయులే. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధికులు తమ అవసరాల నిమిత్తం పీఎఫ్‌ నుంచి కొంత రుణం పొందడం ఆనవాయితీ. ప్రతీ ఏటా ఇదే జరుగుతుంది. కాని గడిచిన ఏడాదిన్నరగా పీఎఫ్‌కి తిప్పలు వచ్చాయి. తాము పొదుపు చేసుకున్న సొమ్ములోనే కొంత రుణంగా తీసుకుందామనుకుంటే ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేక సర్కార్‌ చేతులెత్తేసే పరిస్థితి. పీఎఫ్‌ సొమ్ములు ఎప్పుడో ఇతర ఖాతాలకు జమ అయినట్టు పదేపదే వార్తలు వెలువడుతున్నా సర్కార్‌ మాత్రం కిమ్మనకుండా మౌనం దాల్చింది. ప్రత్యేకించి మహిళా ఉద్యోగులు పీఎఫ్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇవేవీ ఇప్పటికీ కదలికలేకుండా ఉన్నాయి. దాదాపు ఏడాదికి పైగానే ఈ రుణ దరఖాస్తులన్నీ దొంతర్లుగా పేరుకుపోతు న్నాయి. కాని పరిష్కారం మాత్రం కనుచూపు మేర కనిపించడమే లేదు. ఇంతకుముందెన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని, పీఎఫ్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మూడు వారాల్లోపే మంజూరయ్యేదని.. ఎంచక్కా అవసరాలు తీరేవని, కాని ఇప్పుడెక్కడ ? అంటూ ఉద్యోగులే వాపోతున్నారు. జిల్లా పరిషత్‌ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులదీ దాదాపు ఇదే పరిస్థితి. పెద్ద సంఖ్యలో పీఎఫ్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా జడ్పీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కేవలం కొంతమందికి మాత్రమే రుణాలు మంజూరవు తుండగా, పెద్ద సంఖ్యలో మిగతా వారికి స్తంభించిపోతున్నాయి. ‘మీకంతా తెలుసు.. మళ్లీ మళ్లీ మా చుట్టూ ఎందుకు తిరుగుతారు. దరఖాస్తు చేశారు కదా..మంజూరైన వెంటనే మీ ఖాతాల్లో వేస్తాం’ అంటూ పీఎఫ్‌ కోసం తిరిగే వారందరికీ తిరుగు సమాధానం వస్తుంది. ఉద్యోగ విరమణ చేసి నెలలు కావస్తున్నా ఇప్పటికీ వారి ఖాతాలకు పీఎఫ్‌ సొమ్ము జమ చేయలేదు. ఉద్యోగ విరమణ తేదీ నాటికి నయా పైసలతో సహా లెక్కించి వారికి కావాల్సిన అన్నిం టినీ ఇంతకుముందు జమ చేసేవారు. దీనికి తగ్గట్టుగానే పదవీ విరమణ చేసిన వారు కూడా తమ భవిష్యత్తు కోసం పక్కా ప్రణాళిక రూపొందించుకునే వారు. చేసిన అప్పులను సకాలంలో చెల్లించేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారి మరింత సంక్లిష్టంగా తయారైంది. ఇప్పటికే పదవీ విరమణ చేసి దాదాపు 300 మందికిపైగానే ఉపాధ్యాయ,ఉద్యోగుల ఖాతాలకు పీఎఫ్‌ కాని, వారికి రావాల్సిన ఇతర సదుపాయాల సొమ్ముకాని జమ కాలేదు. పోని పీఎఫ్‌ ఒక్కటే అనుకుంటే శుద్ధ తప్పు. జీఎల్‌ఐసీ నుంచి కూడా ఇలాంటి ప్రతిబంధకాలే. జిఎల్‌ఐసి నుంచి రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నా ఆ వైపు నుంచి ఎలాంటి ప్రతి స్పందన లేదు. దీనిపైనా ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

రావాల్సిందెంతో.. ఇచ్చేదెప్పుడో
ఉద్యోగ వర్గాలు కన్నెర్ర చేస్తే ఒకప్పుడు సర్కార్‌ దిగి వచ్చేది. వారు కోరిన కోర్కెలను ఆర్తిక పరిస్థితులను బట్టి కొంతలో కొంత నెరవేర్చేవి. ఆ మేరకు ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించేవి. కాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఒకటొక్కటిగా పేరుకుపోతున్నాయి. ఉద్యోగికి రావాల్సింది భారీగానే ఉన్నా, మరి ఇచ్చేదెప్పుడో తెలియని పరిస్థితి దాపురించిందని ఉద్యోగులే అంటున్నారు. పీఆర్సీ అమలుకు ముందు 2018 నుంచి డీఏ ఎరియర్స్‌ రావాల్సి ఉన్నాయి. దీనిపై ఉద్యోగ సంఘాలు పోరాడుతూనే వచ్చాయి. ఒకవైపు పిఎఫ్‌, మరోవైపు జిఎల్‌ఐసితో సహా ఉద్యోగులకు చెందాల్సిన ఎరియర్స్‌ ఏం చేశారని నిలదీస్తున్నా ఫలితం శూన్యం. ఇప్పటికీ డిఎ ఎరియర్స్‌ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులతో దోబూచులాడుతూనే ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమకు రావాల్సిన బకాయిలపై పదేపదే ఆందోళన చెందుతున్నాయి. కనీసం సరెండర్‌ లీవ్‌ల విషయంలోనూ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఎండగడుతున్నాయి. తామేదో ప్రభుత్వం నుంచి అదనంగా కోరడంలేదని, కేవలం తమ పరిధిలో ఉన్న వాటినే చెల్లించే అవకాశం ఉన్నా దాటవేత వైఖరి అవలంభిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందైతే సరెండర్‌ లీవ్స్‌ను అలవోకగా వినియోగించుకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాస్తా తారుమారైంది. పరిస్థితిని చక్క దిద్దాల్సింది పోయి ప్రభుత్వం మాత్రం మొండి వైఖరి అవలంభిస్తుందని కొందరు వాదిస్తూనే.. పైకి మాట్లాడితే ప్రభుత్వం వ్యతిరేకులమని ముద్ర వేస్తారు, లేదంటే కక్ష సాధింపులకు దిగుతారు, అందుకనే మౌనంగా భరిస్తున్నాం అని ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు.

డీఏ ఎరియర్స్‌ ఎక్కడ సార్‌
షేక్‌ సాబ్జీ, ఎమ్మెల్సీ
పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ పెండింగే. ఉద్యోగులంతా మొత్తుకున్నా కనీసం ఈ ప్రభుత్వం స్పందించడమే లేదు. 2018 నుంచి దాదాపు ఏడు డీఏ బకాయిలు రావాలి. అంటే 30 నెలలు బకాయి పడినట్టే. ఇదంతా మూడు విడతలు చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇదిగో ఇప్పటిదాకా కనీసం కన్నెత్తయినా చూడడం లేదు.

వెనుకబడి’నా గొప్పలే !

సర్కారు పాఠశాలలపై విశ్వాసం ఉంటే 3.50 లక్షల మంది ప్రైవేటుకు ఎందుకు వెళ్లిపోయారు ?
విద్యార్థులు తగ్గితే వివరాలు ఇస్తామన్న మంత్రి బొత్స ఎందుకు మౌనంగా ఉన్నారు ?
ఆంగ్లంలో చూసి వాక్యాన్ని చదవలేకపోతున్న పిల్లలు
అయినా ఆంగ్ల మాధ్యమం వైపే మొగ్గు



కనీసం ఇద్దరు టీచర్లను నియమించాలి

యుటిఎఫ్ డిమాండ్

విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్న వాటిల్లో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని యుటిఎఫ్ డిమాండ్ చేసింది.ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 8 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని, సంస్కరణల్లో భాగంగా మరో 8 వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిల్లో మరో టీచర్‌ను నియమించకపోతే ఇవి సహజ మరణం చెందుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరో టీచర్‌ ఉంటేనే నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ఈ విషయం తెలిసి కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలను నడుపుతోందని విమర్శించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఉపాధ్యాయులు లేకపోవడమే కారణమని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశంపై తన విధానాన్ని పున్ణపరిశీలించుకోవాలని కోరింది. లేదంటే అన్ని ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

♦️వ్యాపార కోణంలో చూడొద్దు: ఎస్‌టియు
విద్యను వ్యాపార కోణంలో చూడొద్దని ఎస్‌టియు అధ్యక్షులు సాయిశ్రీనివాస్‌ రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే నాణ్యమైన విద్య అవసరమన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులుంటేనే అన్ని తరగతుల్లో బోధన చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. పిల్లలు తక్కువ మంది ఉన్నారని నెపంతో ఒక ఉపాధ్యాయుడినే కేటాయిస్తే పిల్లల భవిష్యత్‌ను పాడు చేసినట్లు అవుతుందని తెలిపారు.

జగనన్న విద్యా కానుక.. ఇక మరింత మెరుగ్గా'

చిన్నపాటి లోపాలు సైతం లేకుండా పకడ్బందీగా పథకం అమలు
పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి అభిప్రాయ సేకరణ
నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం అన్ని వస్తువులు ఉండేలా జాగ్రత్తలు..
2023-24 నుంచి ప్రతి విద్యార్థికీ సరిపడేలా అదనపు యూనిఫాం క్లాత్‌
లావుగా ఉన్న పిల్లలకు కూడా క్లాత్‌ సరిపోయేలా చర్యలు
కుట్టు కూలీ ధర పెంపుపై పరిశీలన.. బ్యాగుల్లో మార్పులు
1-5 తరగతులకు మీడియం సైజ్‌ బ్యాగ్‌.. 6-10 తరగతులకు పెద్ద సైజ్‌.. నోట్‌బుక్‌లు, పాఠ్య పుస్తకాలు అన్నీ అమరే విధంగా వెడల్పాటి బ్యాగ్‌
షూ సైజులు తీసుకోవడానికి మండల స్థాయిలో సరఫరాదారులతో మేళాలు
వచ్చే ఏడాది పంపిణీకి ఇప్పటి నుంచే విద్యా శాఖ సన్నాహాలు




Tags