వేతనం , పింఛను చెల్లింపులకు ప్రత్యేక చట్టం చేయాలి
ఒకటో తేదీనే జీతం ఇచ్చేలా చట్టం రావాల్సిన అవసరం ఉంది
ఈటీవీ - ప్రతిధ్వని ' చర్చలో ఉద్యోగసంఘ నేతలు సూర్యనారాయణ , బొప్పరాజు
ఇంటర్వ్యూలతో అక్రమాలని అప్పట్లో గగ్గోలు
పారదర్శకత కోసమే రద్దు చేశామని గొప్పలు
ఇప్పుడు చడీచప్పుడు కాకుండా పునరుద్ధరణ
నాలుగేళ్ల తర్వాత 92 పోస్టులకు నోటిఫికేషన్
సరిగ్గా అప్పుడే ఇంటర్వ్యూలు కొనసాగిస్తూ జీవో
వైసీపీ సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు
ఒక నిర్ణయం తీసుకోవడం... అది చారిత్రాత్మకం అని ప్రచారం చేసుకోవడం... కొన్నాళ్ల తర్వాత తిరిగి పాత విధానాన్నే అమలు చేయడం... వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిపై వెనకడుగు ఉండదని గొప్పలు చెప్పుకొనే సీఎం జగన్... గ్రూప్-1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూల రద్దుపైనా ఇప్పుడు వెనకడుగు వేశారు. గ్రూప్-1 పోస్టుల నియామకాల్లో ఇంటర్వ్యూల నిర్వహణతో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన వైసీపీ ప్రభుత్వం.... 2021 జూన్‌లో జీవో 58 ద్వారా ఏపీపీఎస్సీ నియామకాల్లో మొత్తం ఇంటర్వ్యూలను రద్దు చేసింది. ఇది అత్యంత కీలక, చారిత్రాత్మక నిర్ణయమని, దీనివల్ల నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని అప్పట్లో విపరీతంగా ప్రచారం చేసుకుంది. ఇంత హడావిడి చేసి ఇప్పుడు చడీచప్పుడు లేకుండా గ్రూప్-1 నియామకాల్లో ఇంటర్వ్యూలను పునరుద్ధరిస్తూ ఇటీవల జీవో 119 జారీ చేసింది. గ్రూప్1, లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వాటితో సమానమైన పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయని ఆ జీవోలో స్పష్టం చేసింది. ఇంతలోనే ఏమైందో గానీ తర్వాత రెండురోజులకే దాన్నీ మార్చేసింది. ఆ జీవోలో మార్పులు చేసి కేవలం గ్రూప్-1కే ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొంటూ ఇతర పోస్టులను ఆ జాబితా నుంచి తొలగించింది. సరిగ్గా అదేరోజున 92 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేయడం, మరోవైపు ఇంటర్వ్యూలు పునరుద్ధరించడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.
అప్పట్లో తెలియదా?
ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన పోస్టుల భర్తీలో గత టీడీపీ ప్రభుత్వం ఇంటర్వ్యూల పేరుతో చెప్పలేనన్ని అక్రమాలకు పాల్పడిందంటూ వైసీపీ సర్కారు ఆరోపణలు చేసింది. ఇంటర్వ్యూల ద్వారా కావాల్సిన అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వేసుకుని ఉద్యోగాలు ఇచ్చుకున్నారని నెపాన్ని మోపింది. తద్వారా ఇంటర్వ్యూల రద్దు నిర్ణయం కీలక సంస్కరణగా అభివర్ణించుకుంది. అంత ప్రచారం చేసుకున్న ప్రభుత్వం చివరికి ఒక్క నోటిఫికేషన్‌ను కూడా ఇంటర్వ్యూ రహితంగా భర్తీ చేయకుండానే పాత విధానానికి వెళ్లిపోయింది. గతేడాది జూన్‌లో ఇంటర్వ్యూలు రద్దు చేయగా, పునరుద్ధరణపై పరిశీలన చేయాలని ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో లేఖ రాసింది. దీనిపై యూపీఎస్సీని సంప్రదించగా ఇంటర్వ్యూలు ఉండాలని సూచించిందని, అందువల్లే తిరిగి తీసుకొచ్చామని ఏపీపీఎస్సీ చెబుతోంది. అయితే కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు యూపీఎస్సీని ఎందుకు సంప్రదించలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగుసార్లు అధ్యయనం చేసి పరిశీలించాల్సి ఉండగా... జగన్ ప్రభుత్వం కేవలం ప్రచారం కోసం అప్పట్లో ఆగమేఘాలపై రద్దు నిర్ణయం తీసుకుని దానిపై నిలబడలేక ఇప్పుడు నవ్వులపాలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత నోటిఫికేషన్‌లోనే నష్టం
2018లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ఉద్యోగాలను ఈ ప్రభుత్వంలో భర్తీ చేశారు. వీటికి ఇంటర్వ్యూలు నిర్వహించిన ఏపీపీఎస్సీ... తెలుగేతర వ్యక్తులను ఎక్కువగా ఇంటర్వ్యూ బోర్డుల్లో ఉంచింది. దీంతో తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం జరిగింది. అసలు అభ్యర్థులకు పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో ఎన్ని మార్కులు వచ్చాయో కూడా ఏపీపీఎస్సీ ప్రకటించలేదు. దీంతో నియామకాలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ భర్తీలో భారీగా అవినీతి జరిగిందనే అరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇంటర్వ్యూలు లేకపోతేనే మంచి జరుగుతుందని అభ్యర్థులు ఆశిస్తున్న తరుణంలో ప్రభుత్వం హఠాత్తుగా వాటిని తిరిగి తీసుకొచ్చింది. అది కూడా గ్రూప్-1కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన ముందురోజే ఇంటర్వ్యూలు పునరుద్ధరించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభుత్వంలో గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీనే అత్యంత వివాదాస్పదమైంది. ఏపీపీఎస్సీ కార్యాలయంలో పనిచేసిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అత్యధిక మార్కులు రావడం అప్పట్లో అనేక విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో గ్రూప్-1 నోటిఫికేషన్‌లోనూ గోల్‌మాల్ కోసమే ఇంటర్వ్యూలు తిరిగి తెచ్చారనే అందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.
గ్రూప్-1 ఇంటర్వ్యూలపై పిల్లిమొగ్గలు!
రద్దు నిర్ణయంపై వైసీపీ సర్కారు వెనకడుగుఇంటర్వ్యూలతో అక్రమాలని అప్పట్లో గగ్గోలు

ఉపాధ్యాయుల బదిలీలపై అయోమయం
ఉపాధ్యాయుల బదిలీలపై అయోమయం నెలకొంది. ఈ ఏడాది నిర్వహిస్తారా? లేదా అనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ఏడాది బదిలీలు నిర్వహిస్తామని విద్యా సంవత్సరం మొదట్లో పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. పోస్టుల హేతుబద్ధీకరణ, పదోన్నతులు నిర్వహించి, ఆగస్టులో బదిలీలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ సైతం వెల్లడించారు. ఉపాధ్యాయులు ఒకే స్టేషన్లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉంటే తప్పనిసరి బదిలీ ఉంటుందని చెప్పారు. గతంలో ఇది ఎనిమిదేళ్లు ఉండగా.. ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు ఐదేళ్లకు తగ్గించినట్లు అప్పట్లో పేర్కొన్నారు. అయినా ఇంతవరకు వీటికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల కాలేదు. బదిలీల దస్త్రం మంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లింది. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. బదిలీలకు షెడ్యూల్ ప్రకటిస్తే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సుమారు నెల రోజులు పడుతుంది. ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చినా నవంబరు నెల చివరికిగాని పూర్తికావు. ఈ సమయంలో బదిలీలు చేస్తే పైతరగతుల విద్యార్థులు అభ్యసనకు ఇబ్బందులు ఏర్పడతాయని కొందరు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. గత రెండేళ్లుగా ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించలేదు. దీంతో దూర, మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు బదిలీలు నిర్వహించాలని కోరుతున్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా పదో న్నతులు ఇస్తున్నారు. పదోన్నతి పొందిన వారికి బదిలీ సమయంలోనే కొత్త పోస్టింగ్ ఇస్తామని జిల్లా విద్యాధికారులు పేర్కొంటున్నారు
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరులో అమ్మ ఒడి నిధులు అనర్హుల ఖాతాలకు జమ కావడంతో అధికారులు తొమ్మిది మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. 44 మంది అనర్హుల ఖాతాలకు రూ.5.72 లక్షలు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విద్యాశాఖ, సాంఘిక సంక్షేమశాఖ అధికారులు విచారణ జరిపి తొమ్మిది మంది వాలంటీర్లను బాధ్యులుగా గుర్తిం చారు. చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీడీవో వి. శ్రీనివా సరావును జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. తల్లు లకు తెలియకుండా వారి వేలిముద్రలను వాలంటీర్లు సేకరించి అప్లోడ్ చేశారని ఎంపీడీవో ధ్రువీకరించారు. పిల్లలు లేనివారు, వితంతువులనూ అమ్మఒడి తల్లుల జాబితాలో గుర్తించినట్లు పేర్కొన్నారు. అవినీతికి పాల్ప డిన తొమ్మిది మంది వాలంటీర్లను విధుల నుంచి తొల గిస్తూ ఎంపీడీవో ఆదేశాలు ఇచ్చారు.
ఇప్పటికే 8 వేల సింగిల్ టీచర్ స్కూల్స్
రాష్ట్రంలో ప్రభుత్వ ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య మరింతగా పెరగనుంది. ఇప్పటికే సుమారు 8 వేల వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు మరో 8 వేల వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు కొత్తగా రానున్నాయి. దీంతో రాష్ట్రంలో సుమారు 16 వేల పాఠశాలలుగా సింగిల్ టీచర్‌గా మారనున్నాయి. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలో రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియలో 8 వేల పాఠశాలలు సింగిల్ టీచర్‌కే పరిమితం కాబోతున్నాయని అధికారులు లెక్కలు తేల్చినట్లు తెలిసింది. రేషనలైజేషన్‌లో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 లోపు ఉంటే సింగిల్ టీచర్‌నే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిఓ 117ను కూడా విడుదల చేసింది. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. 5 వేల పాఠశాలలను విద్యాశాఖ విలీనం చేసింది. ఈ పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలకు పంపడంతో మిగతా విద్యార్థుల సంఖ్య 20లోపు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ విలీనం వల్ల సుమారు 4 వేల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20లోపే ఉనుట్లు విద్యాశాఖ తేల్చింది. విలీనం కాని మరో 4 వేల పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య 20 మంది లోపే ఉన్నట్లు గుర్తించింది. దీంతో ఇవి ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్నాయి. ఇప్పటికే ఉన్న 8 వేల పాఠశాలలతో కలిపి మొత్తంగా 16 వేల పాఠశాలలు రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగలనున్నాయి. ఇప్పటికే సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలల్లో బోధన సరిగ్గా సాగడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడు అనారోగ్యం, ఇతర కారణాలతో సెలవులో ఉంటే ఆ పాఠశాలను మూసివేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పాఠశాల విద్యాశాఖ తీసుకొస్తున్న కొత్త కొత్త యాప్‌లలో సమాచారం నమోదు చేసేందుకు ఉపాధ్యాయులు నానా అవస్థలు పడుతూ బోధనపై దృష్టి సారించలేకపోతున్నారు.
ఎంటిఎస్ టీచర్లతో సర్దుబాటు
సింగిల్ టీచర్ పాఠశాలల్లో మినిమం టైమ్‌స్కేల్ (ఎంటిఎస్) ఉపాధ్యాయులను నియమించి ఏకోపాధ్యాయ పాఠశాలలను ఉంచబోమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. డిఎస్‌సి-1998, 2008లో అర్హత సాధించిన అభ్యర్థులను ఎంటిఎస్ విధానంలో విద్యాశాఖ తీసుకుంటోంది. 2008లో అర్హత సాధించిన అభ్యర్థులను ఎంటిఎస్ విధానంలో తీసుకుంది కేవలం 2,500 మంది లోపే. ప్రస్తుతం 1998 అభ్యర్థులను తీసుకునే ప్రక్రియ జరుగుతోంది. ఈ రెండింటితో కలిపి 6 వేల మంది కూడా వచ్చే అవకాశం ఉండదని అధికారులే చెబుతునాురు. అయితే వీరందరినీ ఈ పాఠశాలలకే కేటాయిస్తారా? మరోచోట కేటాయిస్తారా? అనే అంశం కూడా తేలాల్సి ఉంది.
ఓఎంఆర్ జవాబుపత్రం
ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు నిర్వహించే పరీక్షా విధానాన్ని విద్యాశాఖ సమూలంగా మార్పులు చేసింది. పోటీ పరీక్షలను ఎదుర్కొనేంందుకు వీలుగా, అవగాహన సామర్థ్యాలను పెంచే దిశగా ప్రశ్నపత్రాలను రూపొందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు పరీక్షల విధానంలో సరికొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. పాత విధానాలైన నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక పరీక్షలను 9, 10 విద్యార్థులకు మాత్రమే నిర్వహించనున్నారు.
ద్విభాషా విధానంలో..
పరీక్షాపత్రం ద్విభాష విధానంలో ఉంటుంది. చాలా చిన్న జవాబులు (వెరీ షార్ట్ ఆన్సర్స్), చిన్న జవాబులు (షార్ట్ ఆన్సర్స్), బహుళ ఐచ్ఛికం, ఖాళీలు పూరింపుము ప్రశ్నలు ఇస్తారు. ఓఎంఆర్ పత్రాల్లో జవాబులు నింపాలి. ప్రశ్నలన్నీ మెకానికల్, అండర్ స్టాండింగు, అప్లికేషన్ (ఎంయూఏ) విధానంలో ఉండనున్నాయి. ప్రశ్నపత్రం విద్యార్థి అవగాహన సామర్థ్యాన్ని సమగ్రంగా అంచనా వేసే విధంగా ఉంటుంది.
మార్పులు ఇలా..
* ఇప్పటివరకు ఎఫ్‌ఏ (నిర్మాణాత్మక), ఎస్‌ఏ (సంగ్రహణాత్మక) విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా తరగతి గది ఆధారిత మూల్యాంకనం (క్లాస్‌రూమ్ బేస్డ్ అసెస్‌మెంట్ - సీఆర్‌బీఏ)లో జరపాలని నిర్ణయించారు.
* రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్‌సీఈఆర్‌టీ) వీటిని నిర్వహించనుంది. ఏడాదికి మూడుసార్లు సీబీఏ (క్లాస్‌రూమ్ బేస్డ్ అసెస్‌మెంట్) పరీక్షలు నిర్వహిస్తారు.
* 1 - 8 విద్యార్థులు ఇప్పటివరకు ఆరు పరీక్షలు అంటే ఎఫ్‌ఏ-1, 3, 4, ఎస్‌ఏ-1, 2 రాస్తున్నారు. వీరంతా ఎఫ్‌ఎ-1, 3, ఎస్‌ఏ-2కు బదులుగా వీటిని రాయాల్సి ఉంటుంది. ఎఫ్‌ఏ-2, 4, ఎస్‌ఏ-1 పరీక్షలు యథావిధిగా ఉంటాయి.
* పరీక్షాపత్రం రూపకల్పన, మూల్యాంకనం కోసం విద్యాశాఖ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ (ఇఐ)తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఉద్యోగులకు ఊరట - మెడికల్ రీయింబర్స్మెంట్ గడువు పొడిగింపు
- సీఎం జగన్ఆమోదముద్ర
- త్వరలో ఉత్తర్వులు
అమ్మఒడి నిధుల స్వాహా.. వాలంటీర్లపై వేటు
పల్నాడు జిల్లాలో 9 మంది తొలగింపుపల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరులో అమ్మ ఒడి నిధులు అనర్హుల ఖాతాలకు జమ కావడంతో అధికారులు తొమ్మిది మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. 44 మంది అనర్హుల ఖాతాలకు రూ.5.72 లక్షలు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విద్యాశాఖ, సాంఘిక సంక్షేమశాఖ అధికారులు విచారణ జరిపి తొమ్మిది మంది వాలంటీర్లను బాధ్యులుగా గుర్తిం చారు. చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీడీవో వి. శ్రీనివా సరావును జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. తల్లు లకు తెలియకుండా వారి వేలిముద్రలను వాలంటీర్లు సేకరించి అప్లోడ్ చేశారని ఎంపీడీవో ధ్రువీకరించారు. పిల్లలు లేనివారు, వితంతువులనూ అమ్మఒడి తల్లుల జాబితాలో గుర్తించినట్లు పేర్కొన్నారు. అవినీతికి పాల్ప డిన తొమ్మిది మంది వాలంటీర్లను విధుల నుంచి తొల గిస్తూ ఎంపీడీవో ఆదేశాలు ఇచ్చారు.
10 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ నెల 10నుంచి 14వ తేదీ వరకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్ఎస్ సహిత విద్య సమన్వయకర్త ఎస్. రాంబాబు తెలిపారు. ఈ మేరకు డివిజన్ ఉపవిద్యాశాఖాధికారులు, ఎంఈవోలకు ఆదేశాలు పంపినట్లు తెలిపారు. ప్రత్యేక, సాధారణ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇబ్బందులను అధిగమించడంపై ఆయా రోజుల్లో ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు ఆన్లైన్లో శిక్షణ ఉంటుందన్నారు. సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందని వివరించారు. సికిం ద్రాబాద్ కు చెందిన ఎన్ఎస్ఐఈపీ ఐడీ ప్రిన్సిపల్ గణేష్ షెరగర్, ఆచార్యులు డాక్టర్ శిల్పమనోజ్ఞ, కె.ఉషా, బ్యూలాసుశాన్ తదిత రులు శిక్షణ ఇస్తారని తెలిపారు.ఏపీ ఐసెట్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల
ఏపీ ఐసెట్ 2022 ద్వారా ఆర్హత సాదించిన విద్యార్థు లకు ఎంబిఎ, ఎంసిఎలో ప్రవేశానికి గాను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి దశ అడ్మిషన్స్లో భాగంగా ఎంసిఎ, ఎంబి ఎల కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల తొమ్మిది నుండి 12వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈనెల 10 నుండి 14వ తేదీలోపు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఈనెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు వెబ్ అప్షన్స్ను నిర్వహిస్తారు. 17వ తేదీన వెబ్ అప్షన్ల మార్పు ఉం టుంది. 19వ తేదీన సీట్లను కేటాయిస్తారు. 20వ తేదీ నుండి 22వ < తేదీ వరకు సీట్లు పొందిన వాళ్లు ఆకాలేజీలకు వెళ్లి రిపోర్ట్చేయాల్సి ఉంటుంది. 24వ తేదీ నుండి క్లాసులు ప్రారంభమౌతాయిమరో 8 వేల పాఠశాలల్లో ఏకోపాధ్యాయులే!
రేషనలైజేషన్తో పొంచి ఉన్న ప్రమాదంఇప్పటికే 8 వేల సింగిల్ టీచర్ స్కూల్స్
రాష్ట్రంలో ప్రభుత్వ ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య మరింతగా పెరగనుంది. ఇప్పటికే సుమారు 8 వేల వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు మరో 8 వేల వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు కొత్తగా రానున్నాయి. దీంతో రాష్ట్రంలో సుమారు 16 వేల పాఠశాలలుగా సింగిల్ టీచర్‌గా మారనున్నాయి. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలో రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియలో 8 వేల పాఠశాలలు సింగిల్ టీచర్‌కే పరిమితం కాబోతున్నాయని అధికారులు లెక్కలు తేల్చినట్లు తెలిసింది. రేషనలైజేషన్‌లో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 లోపు ఉంటే సింగిల్ టీచర్‌నే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిఓ 117ను కూడా విడుదల చేసింది. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. 5 వేల పాఠశాలలను విద్యాశాఖ విలీనం చేసింది. ఈ పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలకు పంపడంతో మిగతా విద్యార్థుల సంఖ్య 20లోపు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ విలీనం వల్ల సుమారు 4 వేల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20లోపే ఉనుట్లు విద్యాశాఖ తేల్చింది. విలీనం కాని మరో 4 వేల పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య 20 మంది లోపే ఉన్నట్లు గుర్తించింది. దీంతో ఇవి ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్నాయి. ఇప్పటికే ఉన్న 8 వేల పాఠశాలలతో కలిపి మొత్తంగా 16 వేల పాఠశాలలు రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగలనున్నాయి. ఇప్పటికే సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలల్లో బోధన సరిగ్గా సాగడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడు అనారోగ్యం, ఇతర కారణాలతో సెలవులో ఉంటే ఆ పాఠశాలను మూసివేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పాఠశాల విద్యాశాఖ తీసుకొస్తున్న కొత్త కొత్త యాప్‌లలో సమాచారం నమోదు చేసేందుకు ఉపాధ్యాయులు నానా అవస్థలు పడుతూ బోధనపై దృష్టి సారించలేకపోతున్నారు.
ఎంటిఎస్ టీచర్లతో సర్దుబాటు
సింగిల్ టీచర్ పాఠశాలల్లో మినిమం టైమ్‌స్కేల్ (ఎంటిఎస్) ఉపాధ్యాయులను నియమించి ఏకోపాధ్యాయ పాఠశాలలను ఉంచబోమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. డిఎస్‌సి-1998, 2008లో అర్హత సాధించిన అభ్యర్థులను ఎంటిఎస్ విధానంలో విద్యాశాఖ తీసుకుంటోంది. 2008లో అర్హత సాధించిన అభ్యర్థులను ఎంటిఎస్ విధానంలో తీసుకుంది కేవలం 2,500 మంది లోపే. ప్రస్తుతం 1998 అభ్యర్థులను తీసుకునే ప్రక్రియ జరుగుతోంది. ఈ రెండింటితో కలిపి 6 వేల మంది కూడా వచ్చే అవకాశం ఉండదని అధికారులే చెబుతునాురు. అయితే వీరందరినీ ఈ పాఠశాలలకే కేటాయిస్తారా? మరోచోట కేటాయిస్తారా? అనే అంశం కూడా తేలాల్సి ఉంది.
పరీక్ష తీరు మారింది..
ద్విభాషా విధానంలో ప్రశ్నపత్రంఓఎంఆర్ జవాబుపత్రం