Type Here to Get Search Results !

Telugu Educational News 12th Oct 2022

Supreme Court: 50వ సీజేఐగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌

సుప్రీంకోర్టు 50వ (తదుపరి) ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ ధనుంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌ (డి.వై.చంద్రచూడ్‌) పేరును సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ సిఫార్సు చేశారు. సిఫార్సు చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌

సుప్రీంకోర్టు 50వ (తదుపరి) ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ ధనుంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌ (డి.వై.చంద్రచూడ్‌) పేరును సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ సిఫార్సు చేశారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును ప్రతిపాదించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు రాసిన లేఖకు స్పందనగా జస్టిస్‌ చంద్రచూడ్‌ పేరును సిఫార్సు చేస్తూ సీజేఐ లేఖ రాశారు. దాని ప్రతిని మంగళవారం సహచర న్యాయమూర్తుల సమక్షంలో జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌కు అందజేశారు. జస్టిస్‌ యు.యు.లలిత్‌ నవంబరు 8న పదవీ విరమణ చేయనున్నారు. ఆ మరుసటి రోజు (నవంబరు 9న) జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. 2024 నవంబరు 10 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. 44 ఏళ్ల క్రితం ఈయన తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 7 ఏళ్ల 5 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. సుదీర్ఘకాలం కొనసాగిన సీజేఐగా రికార్డు సృష్టించారు.

కీలక తీర్పుల్లో భాగస్వామి
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆరేళ్ల కాలంలో పలు కీలక తీర్పుల్లో జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ భాగస్వామిగా ఉన్నారు. ఆధార్‌ బిల్లును మనీ బిల్లుగా రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదించినట్లు జస్టిస్‌ కె.ఎస్‌.పుట్టుస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయానికి భిన్నంగా ప్రత్యేక తీర్పురాశారు. ఆ చట్టంలోని నిబంధనలు వ్యక్తిగత గోప్యత, గౌరవం, స్వతంత్రతను ప్రభావితం చేస్తాయని చెప్పారు. అలాగే నవ్‌తేజ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఐపీసీ సెక్షన్‌ 377 రాజ్యాంగ విరుద్ధమని, సేమ్‌ సెక్స్‌ ఇంటర్‌కోర్స్‌ చట్టబద్ధమేనని పేర్కొన్నారు. సెక్షన్‌ 377 వలసవాదుల పాలనలో వచ్చిందని, అది ప్రాథమిక హక్కులు, సమానత్వం, భావప్రకటనా స్వేచ్ఛ, జీవితం, వ్యక్తిగత గోప్యతకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మేజర్‌ అయిన వారికి వివాహం, మతం విషయంలో తమకు నచ్చినట్లు నడుచుకొనే స్వేచ్ఛ ఉంటుందని సాఫిన్‌ జహాన్‌ వర్సెస్‌ అశోకన్‌ కేఎం కేసులో తీర్పు చెప్పారు. 10-50 ఏళ్ల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం నిషిద్ధం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని, అలాచేయడం వారి స్వతంత్రత, స్వేచ్ఛ, మర్యాదలను దెబ్బతీయడమేనని ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో స్పష్టంచేశారు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుల కిందకు వస్తుందని జస్టిస్‌ కె.ఎస్‌.పుట్టుస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో 2017 ఆగస్టులో ఏకగీవ్రంగా తీర్పునిచ్చిన 9 మంది సభ్యుల ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. వ్యభిచారం నేరం కాదని జోసెఫ్‌ షైన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో మెజారిటీ తీర్పుతో ఏకీభవించారు. ఐపీసీ సెక్షన్‌ 497 రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 (చట్టం ముందు అందరూ సమానం), 15 (మతం, వర్ణం, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్షచూపడం నిషేధం), 21 (జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ)కు విరుద్ధమని చెప్పారు. శతాబ్దాలుగా మహిళల అణచివేతకు దీన్ని ఉపయోగిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

పాత విధానంలోనే టీచర్ల బదిలీ!

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 5 ఏళ్లపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం మళ్లీ కీలక మార్పులు చేస్తోంది. ప్రతిసారీ టీచర్ల బదిలీలకు ఎనిమిదేళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకుంటుండగా.. ఈసారి దానిని ఐదేళ్లకు కుదించింది. దీనిపై ఉపాధ్యాయులు, సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా ప్రభుత్వం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన అందరికీ బదిలీకి అవకాశం ఇస్తామని ప్రకటించింది. అయితే, దీనికి సంబంధించిన ఫైలు ఇప్పటి వరకు సీఎంవోలో పెండింగ్‌లో ఉంది. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఐదేళ్ల నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ప్రస్తుత ఫైలు ఐదేళ్ల సర్వీసు ఆధారంగా ఉండగా దానిని ఎనిమిదేళ్లకు మార్చి తిరిగి పంపాలని ఆదేశించినట్లు సమాచారం.

ఎనిమిదేళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకుంటే ఎక్కువ మంది మారాల్సిన అవసరం ఉండదు. అదే ఐదేళ్లు తీసుకుంటే ఇప్పుడు దాదాపు 80%మందికి స్థానచలనం తప్పదనే అంచనా ఉంది. విద్యా సంవత్సరం మధ్యలో అంతమందిని ఒకేసారి బదిలీ చేస్తే బోధనపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాగా, బదిలీలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం సాగదీత ధోరణి అవలంబిస్తోంది. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేస్తే ఉపాధ్యాయులకు ఇబ్బంది అవుతుందని ఇటీవల సంఘాలతో జరిగిన సమావేశంలో విద్యామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీంతో బదిలీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే వాదన వచ్చింది. ఇప్పుడు మళ్లీ సర్వీసును మార్చే ప్రతిపాదన ముందుకు తెచ్చింది. కొత్త ప్రతిపాదనతో ఫైలు పెట్టినా ఎప్పటికి దానికి ఆమోదముద్ర పడుతుందో స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా జిల్లా  ఉద్యోగోన్నతి ప్రక్రియ గందరగోళం

ఉద్యోగోన్నతి ప్రక్రియ చాలా గందరగోళంగా ఉందంటూ ఉపాధ్యాయులు, సంఘ నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే సీనియారిటీ జాబితాలో అనేక తప్పులు దొర్లాయని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకోకుండానే ఉద్యోగోన్నతులు కల్పిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. గ్రేడ్-2 హెచ్ఎంలకు ఉద్యోగోన్నతులు కల్పించే క్రమంలో.. అర్హత కలిగిన వారి అంగీకారం తీసుకుంటు న్నారు. ఖాళీలు చూపకుండా.. పదోన్నతులు ఇస్తామని చెప్పడంతో.. అంగీకారం తెలపాలో? వద్దా? అనే సంది గ్ధంలో ఉపాధ్యాయులు ఉన్నారు.

52 అభ్యంతరాలు
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో 12,064 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తు న్నారు. వీరిలో సబ్జెక్టుల వారీగా, సీనియారిటీ జాబితా ప్రకారం ఉద్యోగోన్నతులు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అర్హత లేనివారి పేర్లు జాబి తాలో వచ్చిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హెచ్ఎంలు 23, గణితం 13, పీఎస్-06, పీడీ 3, ఇంగ్లిష్ సబ్జెక్టులో 136 మంది చొప్పున మొత్తం 181 మందికి ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు. హెచ్ఎంల పోస్టులపై 10, మిగిలిన సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్ల కేటగిరీలో 42 అభ్యంతరాలు రాగా.. వాటిని పరిశీలించిన విద్యాశాఖ నివేదికను కమిషనరేట్కు అందజేసింది. ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా పదోనతులు కల్పిస్తున్నారంటూ పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. గతేడాది నిర్వహించిన పదోన్నతుల్లో... వివిధ మండలాల్లో గ్రేడ్-2 హెచ్ఎం పోస్టులకు రిలం కుష్మెంట్ తెలిపారు. ప్రస్తుత జాబితాలో వారి పేర్లు కూడా వచ్చాయని అంటున్నారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత తుది జాబితా ప్రదర్శించకుండా ఉద్యోగోన్నతులు నిర్వహించడాన్ని తప్పుపడుతున్నారు.

♦️తీసుకోవాలా?.. వద్దా?
ఉద్యోగోన్నతి ప్రక్రియలో భాగంగా మంగళవారం గ్రేడ్-2 హెచ్ఎం పోస్టులకు సంబంధించి సీనియారిటీ జాబితా ప్రకారం పలువురిని పిలిచి అంగీకారం తెలిపాలని జిల్లా విద్యాశాఖ నుంచి సంక్షిప్త సందేశాలు. వెళ్లాయి. 22 పోస్టులకు 90 మందిని వరకు పిలిచినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మధ్యాహ్నం చెప్పి సాయంత్రానికి రమ్మంటే ఎలా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. తొలుత ఆన్లైన్లో అంగీకారం తెలిపితే సరిపోతుందన్నారని, మళ్లీ మచిలీపట్నం. రావాలంటే ఎలా అంటూ పేర్కొంటున్నారు. అంగీకారం తెలిపేందుకు డీఈవో కార్యాలయానికి వచ్చిన ఉపాధ్యాయులు.. ఇప్పుడు అంగీకారం తెలిపితే ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడకు వెళ్లాల్సి ఉంటుందేమోనని వెనుకంజ వేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్ గడువు పొడిగింపు

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెడికల్ రీయంబర్స్మెంట్ పథకం గడువును 2022 ఆగస్టు 1వ తేదీ నుండి 2023 మార్చి 31వరకూ పొడిగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి ఎంటీ క్రిష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పలు ఉద్యోగ సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తుల్ని పరిశీలించిన అనంతరం మరికొంత కాలం పాటు దీన్ని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్ఎస్)తో పాటు మెడికల్ రిఎంబర్స్ మెంట్ స్కీంను కూడా వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఇహెచ్ఎస్ పథకాన్ని సులభతరం చేసేందుకు అనువైన విధానాల్ని అందుబాటులోకి తేవాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఒకు సూచించారు. ఇందుకు సంబంధించి ఆరోగ్య శ్రీ సిఇవో అవసరమైన చర్యల్ని తీసుకోవడంతో పాటు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని < ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎటువంటి సమస్యలకు గురికాకుండా ఉండేందుకు గాను తగిన యంత్రాంగాన్ని ఆరోగ్యశ్రీ సిఇవో ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఆర్థిక శాఖ సమ్మతి మేరకే ఈ ఉత్తర్వుల్ని జారీ చేశామని కృష్ణ బాబు స్పష్టం చేసారు.

న్యాయం చేయాలంటూ డీఎస్సీ అభ్యర్థుల ధర్నా 

రాష్ట్ర ప్రభుత్వం 1998 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసిందని, తమకూ తగిన న్యాయం చేయాలని 1996 డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు విజయవాడ ధర్నాచౌక్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కొందరు డీఎస్సీ 96 అభ్యర్థులకు న్యాయం చేశారని, మిగిలిన 200 మందికీ న్యాయం చేయలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. దీపావళి పండగ నాటికైనా పోస్టింగ్లు ఇచ్చి తమ కుటుంబాల్లో సంతోషం నింపాలపి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ 1996వ బ్యాచ్ అభ్యర్థుల సంఘం నాయకులు జి. గోపాల్, నంద కుమార్, దానియేల్, తిప్పస్వామి, చవిటి రాజు తదితరులు పాల్గొన్నారు. తొలుత వీరి ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన వ్యక్తం చేసి వెళ్లిపోవాలని పోలీసులు హుకుం జారీ చేయడంతో... అప్పటి వరకు ధర్నా చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సదుపాయం రెండేళ్లు పొడిగింపు 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సదుపాయాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం ఈ సౌకర్యాన్ని సెప్టెంబరు 25, 2024లోగా వినియోగించుకోవచ్చు. ఇందులో భాగంగా కేంద్రప్ర భుత్వ ఉద్యోగులు జమ్మూ-కశ్మీర్, లద్దాఫ్, అండ మాన్-నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించవచ్చు. ఎల్టీసీ కింద అర్హత గల ఉద్యోగులు రాను-పోను టికెట్ ఛార్జీలను తిరిగి పొందుతారు.

పదవీ విరమణ వయసు పెంపుపై వివరాలు సేకరిస్తున్న ఆర్థిక శాఖ

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకుపెంచేందుకు ఆర్థిక శాఖ వివరాలు సేకరిస్తోంది. ఈ ఏడాది జనవరి వరకుఉన్న ఉద్యోగుల వివరాలను బుధవారం లోపు పంపించాలని ఆయా విభాగాలను కోరింది. ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి ఈ-మెయిలు ఈ సమాచారం.పంపించాలని సూచించింది. కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే వారికి 62 ఏళ్ల పెంపు వర్తించదని ఇటీవల ఆర్థిక ఆదేశాలు జారీ చేయడంతో దీనిపై ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వంపునరాలోచనలో పడింది. ముందుగా వివరాలను సేకరిస్తోంది.

వార్డెన్లు హాస్టళ్లలోనే ఉండాలి

సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నాగార్జున
హాస్టళ్లపై డీడీలు దృష్టి కేంద్రీకరించాలి
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు


వసతి గృహాల్లోని విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లపై చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరించారు. త్వరలోనే తాను వసతి గృహాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తా నని చెప్పారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగ ళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సమీక్షా సమావే శంలో ఆయన పలు అంశాలపై చర్చించారు. 'వార్డెన్లు వసతి గృహాల్లో ఉండకపోవడమే సమస్యలు పెరగడా నికి ప్రధాన కారణం. ముఖ్యంగా భోజన సమయంలో వారు అక్కడే ఉంటే పిల్లల ఇబ్బందులు అర్థమవు తాయి. సాంఘిక సంక్షేమ సాధికారతా అధికారులు ప్రతి నెలా వసతి గృహాలను సందర్శించి పరిస్థితుల్ని స్వయంగా తెలుసుకోవాలి. వార్డెన్లు అక్కడే ఉండేలా చూడాలి' అని ఆదేశించారు. రాష్ట్రంలోని 1,015 వసతి గృహాల్లో 500 చోట్ల 'నాడు-నేడు' మొదటి విడత కింద మరమ్మతులు చేస్తామన్నారు. వివిధ సంక్షేమ పథ కాల ప్రగతిని మంత్రి సమీక్షించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, డైరె క్టర్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

గరిష్ట కాలపరిమితి 8 ఏళ్లే !

ఉపాధ్యాయ బదిలీలపై సిఎం నిర్ణయం

 ఉపాధ్యాయుల బదిలీల్లో గరిష్ట కాలపరిమితి స్టాండ్) ఎనిమిదేళ్లు ఉండాలని (లాంగ్ ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఉపాధ్యాయ బదిలీల్లో ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు ఒకేచోట పనిచేసిన ఉపాధ్యాయుడు కచ్చితంగా బదిలీ కావాల్సి ఉంటుంది. అయితే పాఠశాల విద్యాశాఖ ఎనిమిదేళ్ల నిబంధనను ఐదేళ్లకు కుదించాలని నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లకు సంబంధించిన ఫైల్ను కూడా సిఎంఒకు పంపింది. ఈ ఫైల్ను సిఎంఒ తిరస్కరించింది. ఎనిమిదేళ్ల విధానంలో ప్రతిపాదనలు పంపాలని పాఠశాల విద్యాశాఖను కోరింది. దీంతో మరలా గరిష్ట కాలపరిమితి ఎనిమిదేళ్లకు మార్చి విద్యాశాఖ మంత్రి ద్వారా పాఠశాల విద్యాశాఖ సిఎంఒకు పంపేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ ఫైలు సిఎంఒ ఆమోదం తెలిపితే పాత పద్ధతిలోనే ఉపాధ్యాయ బదిలీలు జరిగే అవకాశం ఉంది.

రేపు పాలిటెక్నిక్ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈనెల 13 న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు
పాలిసె ట్ -2022 లో అర్హత సాధించిన విద్యార్థులతో పాటు పాలిసెట్కు హాజరు కాని , ఫెయిలైన విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చు .
ఇంటర్ , ఐటీఐలలో పాస్ , ఫెయిల్ అయిన విద్యార్థులు సైతం అర్హులే .
ప్రవేశాల కోసం పాలిసెట్ -2022 హాల్ టికెట్ , ర్యాంకు కార్డు , టెన్త్ మార్కుల జాబితా , టీసీ , 4 వ తరగతి నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికెట్లు , ఎస్సీ , ఎస్టీ , బీసీ , ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలు , నివాస ధ్రువపత్రంతో స్పాట్ అడ్మిషన్కు హాజరు కావాలి
Tags