Type Here to Get Search Results !

Telugu Educational News 7th Oct 2022

మహా మాంద్యం ముంచుకొస్తోంది

రూ.327 లక్షల కోట్ల జీడీపీ హాంఫట్‌ జూ ఐఎంఎఫ్‌ ఎండీ
వాషింగ్టన్‌: ఆర్థిక మాంద్యం ముప్పు రోజు రోజుకీ పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) కూడా ఇదే అభిప్రాయానికి వచ్చింది. ప్రపంచ దేశాలకు పెద్ద ఆర్థిక మాంద్యం పొంచి ఉందని ఆ సంస్థ ఎండీ క్రిస్టాలినా జార్జీ వా హెచ్చరించారు. ఈ మాంద్యం కారణంగా ప్రపంచ దేశాల స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 2026 నాటికి దాదాపు నాలుగు లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.327.76 లక్షల కోట్లు) మేరకు తరిగిపోతుందన్నారు. ‘మాంద్యానికి దారితీసే రిస్క్‌ పెరుగుతోంది’ అని జార్జిటౌన్‌ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె హెచ్చరించారు. ఈ సంవత్సరం లేదా వచ్చే ఏడాది ప్రపంచ జీడీపీలో మూడో వంతు వాటా ఉన్న దేశాల జీడీపీ వరుసగా రెండు త్రైమాసికాలు మైనస్‌ స్థాయికి పడిపోతుందని జార్జీవా చెప్పారు.

వృద్ధి రేటుకీ ఎసరు: 
ఈ సంవత్సరం ప్రపంచ జీడీపీ వృద్ధిరేటును కూడా ఐఎంఎఫ్‌ 3.2 శాతానికి కుదించేసింది. వచ్చే ఏడాది ఇది మరింత తగ్గి 2.9 శాతం మించక పోవచ్చునని ఆమె అన్నారు. ప్రపంచ జీడీపీ అంచనాలను ఐఎంఎఫ్‌ కుదించడం ఈ ఏడాది వరుసగా ఇది నాలుగోసారి. నవంబరు నుంచి రోజువారీ చమురు ఉత్పత్తి 20 లక్షల పీపాలు తగ్గిస్తున్నట్టు ఒపెక్‌ దేశాలు బుధవారం ప్రకటించాయి. ఆ మరుసటి రోజే ఐఎంఎఫ్‌ ఎండీ ఆర్థిక మాంద్యం హెచ్చరిక చేయడం విశేషం. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతోనే ఈ ఆర్థిక మాంద్యం ముప్పు ఏర్పడిందని జార్జీవా స్పష్టం చేశారు.

ప్రపంచ బ్యాంకింగ్‌ రంగంలో మరో ముసలం!

  • పతనం అంచున క్రెడిట్‌ స్విస్‌, డాయిష్‌ బ్యాంక్‌!!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో ముప్పు పొంచి ఉందని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యూరప్‌ బ్యాంకింగ్‌ దిగ్గజాలు క్రెడిట్‌ స్విస్‌, డాయిష్‌ బ్యాంక్‌ కుప్పకూలే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. క్రెడిట్‌ స్విస్‌ గనుక కుప్పకూలితే, 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీసిన అమెరికన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌ ‘లేమన్‌ బ్రదర్స్‌’ దివాలా సంక్షోభం పునరావృతం కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్‌ స్విస్‌.. ప్రపంచంలోని అత్యంత ప్రభావిత, అతి పురాతన బ్యాంకింగ్‌ సంస్థల్లో ఒకటి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు క్రెడిట్‌ స్విస్‌ షేర్లు దాదాపు 60 శాతం మేర క్షీణించాయి. అలాగే, ఈ బ్యాంకింగ్‌ సంస్థ క్రెడిట్‌ డిఫాల్ట్‌ స్వాప్స్‌ (సీడీఎస్‌) ప్రీమియం 14 ఏళ్ల (2008 నాటి) గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఏదైనా సంస్థ తీసుకున్న రుణాలకు బీమా లాంటిది సీడీఎస్‌. రుణం తిరిగి చెల్లింపుల్లో రిస్క్‌ పెరిగే కొద్దీ సీడీఎస్‌ ప్రీమియం కూడా పెరుగు తూ పోతుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ స్విస్‌ కుప్పకూలవచ్చని, మరో లేమన్‌ బ్రదర్స్‌ కానుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. డాయిష్‌ బ్యాంక్‌దీ ఇంచుమించు ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా 50,000కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్న క్రెడిట్‌ స్విస్‌ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ గత ఏడాది చివరికి 1.6 లక్షల కోట్ల డాలర్ల పైమాటే.

ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు అర్హుల జాబితా

నూజివీడు టౌన్‌, అక్టోబరు 6: ఏలూరు జిల్లా నూజివీడులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలో గల ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీకి సెలక్షన్‌ లిస్ట్‌ను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు ఆర్జీయూకేటీ అడ్మిషన్స్‌ కన్వీనర్‌ గోపాలరాజు తెలిపారు. పీహెచ్‌, క్యాప్‌ తదితర విభాగాల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసుకున్న అభ్యర్థుల కాల్‌లెటర్లు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచామని, వ్యక్తిగతంగా సెల్‌ఫోన్లకు సమాచారం పంపామని పేర్కొన్నారు.

చారిత్రక స్థాయికి రూపాయి పతనం


ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తులు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్టుడే: జాతీయ ఉపకారవేతన పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, వసతిసౌకర్యం లేని ఆదర్శపాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేం దుకు అర్హులన్నారు. ఓసీ, బీసీలకు రూ.100లు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 50ల చొప్పున రుసుము చెల్లించి ఈనెల 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వెబ్ సైట్ లేదా డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

DSC 1998 Certificate Verification News

ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు డీడీవో అధికారాలు

అమరావతి: రాష్ట్రంలోని 163 ఆదర్శ పాఠ శాలల ప్రిన్సిపాళ్లకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధి కారాలను (డీడీవో) బదలాయించేందుకు ట్రెజరీ డైరె క్టర్ గురువారం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈ ఉత్తర్వుల వల్ల జీతాలు, సెలవులు మంజూరు అధికారాలు ఇక నుంచి ప్రిన్సిపాళ్లకు ఉంటాయి.

అన్ని కోర్సుల్లో సైబర్ సెక్యూరిటీ పాఠాలు: యూజీసీ

🌻ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు నిర్వహించే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో సైబర్ సెక్యూరిటీని పాఠ్యాంశంగా చేర్చాలని యూజీసీ చైర్మన్ ఎం. జగదీశ్ కుమార్ సూచించారు. 'సైబర్ సెక్యూరిటీ దివస్' సందర్భంగా గురువారం సాయంత్రం నిర్వ హించిన వెబ్కాస్ట్లో ఆయన మాట్లాడారు. ఈ పాఠ్యాంశాల బోధన కోసం అన్ని విద్యాసంస్థలు సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్, ఐటీ నిపుణులను నియమించుకోవాలన్నారు. ఏ అంశాలను పాఠ్యాం శాలుగా చేర్చాలో సూచిస్తూ ఒక కరపుస్తకాన్ని కూడా ఆయన విడుదల చేశారు.

పీఎఫ్ చందాదార్లెవరూ వడ్డీ కోల్పోలేదు

♦️సాఫ్ట్వేర్ అప్గ్రేడింగ్తో జమ ఆలస్యం: ఆర్థిక శాఖ
దిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ ఓ) చందాదార్లకు వడ్డీ పరంగా ఎటువంటి నష్టం జరగలేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. సాఫ్ట్వేర్ అప్ గ్రేడింగ్ ప్రక్రియ వల్లే గత ఆర్థిక సంవత్సరానికి సంబం దించిన వడ్డీ జమ ఆలస్యమైందని పేర్కొంది. సెటిల్మెంట్, పీఎఫ్ ఉప సంహరణకు దరఖాస్తు చేసుకున్న వారికి వడ్డీతో కలిపే చెల్లింపులు చేస్తున్నట్లు పేర్కొంది. 'చందాదార్లు ఎవరికీ వడ్డీ నష్టం జరగలేదు. అందరి ఖాతాల్లో వడ్డీ జమ అయింది. పన్ను విధానంలో వచ్చిన మార్పుల కారణంగా సాఫ్ట్వేర్ అప్ గ్రేడింగ్ ప్రక్రియ చేపట్టడంతో.. వడ్డీ జమ అయి నట్లు స్టేట్మెంట్లో కనిపించలేదు" అని మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈపీఎఫ్ వడ్డీ జమ విషయంలో టి. వి. మోహన్దాస్ పాయ్ లేవనెత్తిన సందేహాలకు స్పందిస్తూ ఆర్థిక శాఖ ఈ స్పష్టత ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీ రేటును చెల్లించేం దుకు ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వార్షికంగా పీఎఫ్ జమ రూ.2.5 లక్షలకు మించితే పన్ను విధించడాన్ని 2021-22 నుంచే ప్రభుత్వం ప్రారంభించింది.

APOSS SSC Inter ప్రవేశాలకు 15 వరకు ప్రవేశాలకు గడువు

పెడన గ్రామీణం, న్యూస్టుడే: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సార్వత్రిక పది,ఇంటర్ ప్రవేశాలకు ఈనెల 15 వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా తెలిపారు. సార్వత్రిక పది, ఇంటర్ ప్రయివేటు కేంద్రాల ద్వారా ఈ ఏడాది ప్రవేశాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రయివేటు కేంద్రాలు తమ అనుమతులను పునరుద్ధరించుకోవాలని తెలిపారు. ఈ ఏడాది పది, ఇంటర్ ఉత్తీర్ణత సాధిం చిన విద్యార్థులకు మార్కుల జాబితాల్ని డివిజన్ కేంద్రాలకు అందజేయను న్నట్లు వివరించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి మూడో శుక్రవారం స.హ. దినం

ఆర్టీఐ చీఫ్ కమిషనర్ శ్రీనివాసరావు
అమరావతి: నెలలో ప్రతి మూడో శుక్రవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు దినం (ఆర్టీఐ డే) గా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆర్టీఐ రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆర్. శ్రీని వాసరావు తెలిపారు. నెలలో వచ్చిన ఆర్టీఐ దరఖాస్తులు, ఫిర్యాదులను ఆ రోజున పరిష్కరించేలా క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోనున్నా రని ఆయన చెప్పారు. ఈనెల 5న ప్రారంభమైన ఆర్టీఐ వారోత్సవాల్లో భాగంగా గురువారం కమిషనర్లు కె. చెన్నారెడ్డి, కె.జనార్దనరావుతో కలిసి చీఫ్ కమిషనర్ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. 'ఆర్టీఐ ఫిర్యా దుల పరిష్కారం కోసం కమిషనర్లు తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం. కొన్ని ఫిర్యాదులపై విచారణ కోసం జిల్లా అధికారులు చీఫ్ కమిషనర్ కార్యాలయానికి ప్రత్యక్షంగా హాజ రవుతున్నారు. దీనివల్ల ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా కమిషనర్లే జిల్లాలకు వెళ్లాలని నిర్ణయించాం. ఈ విధానంతో జిల్లా స్థాయిలోనే చాలా ఫిర్యాదులు పరిష్కారమవుతాయి. సమాచార హక్కు చట్టంపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంపిక చేసిన 25-30 గ్రామాల్లో ఈనెల 12లోగా న్యాయ కళాశాలల విద్యార్థులతో అవగాహన కల్పించ నున్నాం. 2019 మే నుంచి 2022 ఆగస్టు వరకు వచ్చిన 23,618 అప్పీళ్లు, ఫిర్యాదుల్లో 21,211 వరకు పరిష్కరించాం. కొత్తగా మరో ఇద్దరు కమిష నర్లు రాబోతున్నందున ఏ నెలలో వచ్చిన ఫిర్యాదులు, అప్పీళ్లు అదే నెలలో పరిష్కరించే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఆన్లైన్లోనూ ప్రజల నుంచి అప్పీళ్లు, ఫిర్యాదులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్టీఐ విషయంలో సకాలంలో సమాచారం ఇవ్వకపోయినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా అలాంటి అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తున్నాం. 20 మంది అధికా రులపై జరిమానా కూడా విధించాం. మూడేళ్ల న్యాయ విద్యలో సమాచార హక్కు చట్టం ఒక సబ్జెక్ట్ గా చేర్చాలని గవర్నరికి ప్రతిపాదించాం' అని చీఫ్ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు.

రెండేళ్ల కోర్సుకు మూడేళ్ల వ్యవధి గందరగోళంలో డీఈఎల్ఈడీ అభ్యర్థులు



APUS కు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం

రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం (ఆప్‌స)కు శాశ్వత సభ్యత్వం కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆ సంఘం అధ్యక్షుడు సీహెచ్‌ శ్రవణ్‌కుమార్‌ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Tags