Type Here to Get Search Results !

Telugu Educational News 8th Oct 2022

మానవ హక్కుల పోరాటాలకు నోబెల్‌ శాంతి బహుమతి

బెలారస్‌ ఉద్యమకారుడు అలెస్‌ బియాల్‌యాస్కీతోపాటు రష్యా, ఉక్రెయిన్‌ సంస్థలకు సంయుక్తంగా అత్యున్నత గౌరవం 
బహుమతికి ఎంపికైన ‘మెమోరియల్, ‘సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’ సంస్థలు ప్రకటించిన నార్వే నోబెల్‌ కమిటీ

ఓస్లో: మానవ హక్కుల పరిరక్షణ కోసం కొనసాగుతున్న ఉద్యమాలకు నోబెల్‌ కమిటీ అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. బెలారస్‌ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్‌ బియాల్‌యాస్కీ(60), రష్యా మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్‌’, ఉక్రెయిన్‌ సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’కు సంయుక్తంగా 2022 సంవత్సరానికి గాను నోబెల్‌ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించింది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల్లోని సంస్థలు ప్రపంచ ప్రతిష్టాత్మక బహుమానానికి ఎంపిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉక్రెయిన్‌పై దండెత్తుతున్న రష్యా అధినేత పుతిన్‌ ఏకపక్ష వైఖరిపై ఇదొక నిరసన అని నిపుణులు అంచనా వేస్తున్నారు. బెలారస్, రష్యా, ఉక్రెయిన్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, శాంతియుత సహజీవనం వంటి అంశాల్లో గొప్ప చాంపియన్లు అయిన ముగ్గురిని (ఒక వ్యక్తి, రెండు సంస్థలు) శాంతి బహుమతితో గౌరవిస్తుండడం ఆనందంగా ఉందని నార్వే నోబెల్‌ కమిటీ చైర్మన్‌ బెరిట్‌ రీస్‌–ఆండర్సన్‌ చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడారు. వారంతా సైనిక చర్యలను వ్యతిరేకిస్తూ మానవీయ విలువలు, న్యాయ సూత్రాల రక్షణ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం వర్థిల్లాలని ఆల్ఫెడ్‌ నోబెల్‌ ఆకాంక్షించారని గుర్తుచేశారు.

బియాల్‌యాస్కీని విడుదల చేయండి
జైలులో ఉన్న అలెస్‌ బియాల్‌యాస్కీని విడుదల చేయాలని బెలారస్‌ పాలకులకు బెరిట్‌ రీస్‌–ఆండర్సన్‌ విజ్ఞప్తి చేశారు. బహుమతి బియాల్‌యాస్కీలో నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని, ఆయనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించబోదని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా మానవ హక్కుల సంస్థకు శాంతి బహుమతి ప్రకటించడం ద్వారా.. శుక్రవారం 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న పుతిన్‌కు ఉద్దేశపూర్వకంగా ఏదైనా సంకేతం పంపదలిచారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ప్రజలకు మంచి చేసేవారికి బహుమతి ఇస్తుంటామని, అంతేతప్ప తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, వ్యక్తుల పుట్టినరోజులతో తమకు సంబంధం లేదని బెరిట్‌ రీస్‌–ఆండర్సన్‌ బదులిచ్చారు.

ఈ ప్రైజ్‌ పొందడం ద్వారా ఆయా సంస్థల వెనుక ఉన్న వ్యక్తులు వారు నమ్మినదాని కోసం మరింత ఉత్సాహంతో కృషి సాగిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. గత ఏడాది(2021) నోబెల్‌ శాంతి బహుమతిని సంయుక్తంగా అందుకున్న రష్యా జర్నలిస్టు దిమిత్రీ మురతోవ్, ఫిలిప్పైన్స్‌ జర్నలిస్టు మారియా రెస్సా అక్కడి ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము పనిచేస్తున్న మీడియా సంస్థల్లో ఉద్యోగాలను కాపాడుకోవడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం సాగించిన పోరాటానికి వీరిద్దరికి నోబెల్‌ లభించింది.

డీఈవో అధికారాలపై దిక్కుతోచని స్థితిలో విద్యాశాఖ

జెడ్పి టీచర్లపై చర్యలు తీసుకునే అధికారం లేదన్న హైకోర్టు
ఏమీ తేల్చుకొని విద్యాశాఖ అధికారులు




Scheduled Caste status : మతం మారినవారికి ఎస్సీ హోదాపై కమిషన్ : కేంద్రం

న్యూఢిల్లీ : చారిత్రకంగా షెడ్యూల్డు కులాలకు చెందినవారు ఇతర మతాలకు మారితే, వారికి షెడ్యూల్డు కులం (SC) హోదా కల్పించడంపై పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిషన్‌ను నియమించింది. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ (KG Balakrishnan) ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు.

చారిత్రకంగా షెడ్యూల్డు కులాలకు చెందినవారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్‌లో పేర్కొనని మతంలోకి మారినపుడు, వారికి ఎస్సీ హోదా కల్పించడంపై పరిశీలన జరిపేందుకు త్రిసభ్య కమిషన్‌‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ గురువారం జారీ చేసింది. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఈ కమిషన్‌కు నేతృత్వం వహిస్తారు. మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవీందర్ కుమార్ జైన్, యూజీసీ మెంబర్ ప్రొఫెసర్ సుష్మా యాదవ్ ఈ కమిషన్‌ సభ్యులుగా నియమితులయ్యారు.

భారత రాజ్యాంగంలోని అధికరణ 341 ప్రకారం వివిధ సందర్భాల్లో జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్‌ను దృష్టిలో ఉంచుకుంటూ ఈ అంశాన్ని ఈ కమిషన్ పరిశీలిస్తుంది. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే, ప్రస్తుత షెడ్యూల్డు కులాలవారిపై ఎటువంటి ప్రభావం పడుతుందనే అంశాన్ని కూడా పరిశీలిస్తుంది. ఇతర మతాల్లోకి మారినవారు కోల్పోతున్నవాటిని, వారిపట్ల సాంఘిక వివక్ష పరిస్థితులు, వారి ఆచార, సంప్రదాయాల్లో మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.

ఇప్పటి వరకు హిందూ దళితులు, బౌద్ధులు, సిక్కులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ ప్రయోజనాలను క్రైస్తవం, ఇస్లాంలోకి మారిన దళితులకు కూడా వర్తింపజేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. 1950లో జారీ అయిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ ప్రకారం హిందూ దళితులకు మాత్రమే ఎస్సీ హోదా ఉంది. 1956లో సిక్కు దళితులకు ఈ హోదా కల్పిస్తూ ఓ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జారీ అయింది. 1990లో బౌద్ధ దళితులకు కూడా ఈ హోదా కల్పించారు.

డీఏ ఎరియర్స్ వడ్డీతో సహా చెల్లించాలి

♦️ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ

ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుంటే... కలిసొచ్చే ఉద్యోగ సంఘాలతో వచ్చే నెల ఒకటి నుంచి స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ, ఆస్కార్‌రావులు స్పష్టం చేశారు. ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు ఎరియర్స్‌ వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో పీఆర్సీ పెండింగ్‌ అంశాలు, ఉద్యోగుల సమస్యలపై ఆర్థికశాఖ అధికారులను కలిసిన అనంతరం సూర్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబరు 30 లోగా సీపీఎ్‌సపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని, ఇప్పటికీ దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. 1-9-2004 కంటే ముందు ఉద్యోగాల్లో నియమితులైన వారికి ఏపీపీఎస్‌సీ, గ్రూప్‌-2-99  ఉద్యోగులకు, అదే విధంగా 20-03లో డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు 1-9-2004 కంటే ముందే నియామకప్రక్రియ జరిగి 1-9-2004 అనంతరం ఉద్యోగాల్లో నియమితులైన ఉద్యోగులకు కేంద్ర మార్గదర్శకాలప్రకారం ఓపీఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.    

జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు

ఖాళీగా ఉన్న 9 వ తరగతి లో ప్రవేశానికి అక్టోబర్ 15 చివరి తేదీ 

ప్రైవేటు ' లెక్కలు తేల్చండి -విద్యార్థులందరి పేర్లు నమోదు చేయట్లేదు .

డ్రాపౌట్లుగా చూపించే వారంతా ఏమయ్యారు ? 
ఎల్కేజీ , యూకేజీ వివరాలు అప్లోడ్ చేయాలి
అదనపు సెక్షన్లకు అనుమతులు ఉన్నాయా ? 
విద్యార్థుల సంఖ్య తగ్గడంపై సర్కారు దృష్టి ప్రధానోపాధ్యాయులకు తనిఖీల బాధ్యతలు



నిలిచిపోయిన NTSE పరీక్ష

2021 మార్చి వరకే కేంద్రం ఆమోదం
మళ్లీ అనుమతిచ్చే వరకు పరీక్ష లేనట్లేనని ప్రకటించిన ఎన్సీఈఆర్టీ



నిధులేక నిలిచిన ' ఇంటర్ ' ముద్రణ

విద్యార్థులకు అందని ఉచిత పుస్తకాలు
ఆ ఫీజుల డబ్బులు ' నాడు - నేడు ' పనులకు మళ్లింపు


పదోన్నతుల ప్రక్రియ గందరగోళం




ట్రిపుల్ ఐటీల్లో ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల 

నూజివీడు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో వికలాంగులు, సైనికోద్యో గుల పిల్లలు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ప్రత్యేక కేటగిరీ సీట్లకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆర్జీయూకేటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల కన్వీసర్ ఆచార్య ఎస్ఎస్ఎస్పీ గోపాలరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం తెలియజే స్తామని వివరించారు. ఎంపికైన విద్యార్థులు వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్ సీసీ కోటా కేటగిరీలో సీట్లు పొందినవారి జాబితాను రెండు నుంచి మూడు వారాల్లో విడుదల చేస్తామని తెలిపారు.